2024–2025 శ్రీ క్రోది నామసంవత్సరంలో రాశి ఫలాలు
ఏడాది కాలంపాటు మనల్ని నడిపించేది పంచాంగం
వేద పండితుల పంచాంగం ఆధారంతో
కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల
సింహ రాశి.
మఖ,పుబ్బ,ఉత్తర 1వ పాదం
అదాయం 2,వ్యయం 14,రాజపూజ్యం ,అవమానం 2
బృహస్పతి యోగంవలన మే వరకు మంచి ధన లాభం,సుఖ,సంతోషాలు ఉంటాయి. ఏపని చేసిన మంచి ఫలితాలు సాధిస్తారు.చేసే ప్రతి పనితో ధన లాభం ఉంటుంది.వ్యాపారరంగం కూడా మే వరకు అనుకూలంగా ఉంటుంది.చేసే వృత్తిలో జాగ్రత్తలు పాటించాలి. మే తరువాత విదేశీప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. అవివాహితులకు మే వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి. భూమి, గృహ,వాహన కొనుగోలు చేసేవారు చాల కష్టపడాల్సి ఉంటుంది.విద్యార్థులకు మే వరకు అనుకూలంగా ఉంది.మనోడైర్యంతో కష్టాలను అధిగమించాల్సి ఉంది. శని,రాహు,కేతు గ్రహాలకు ఒకసారి పూజ చేయడం మంచిది.