సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే ఎటు విన్నా మైకుల గోల.వినాయక చవితి నవరాత్రులు వచ్చాయంటే తొమ్మిది రోజులు వీది,వీధి లో మైకుల మోత. దుర్గాదేవి ఉత్సవాలు వచ్చాయంటే ఎక్కడ చూసినా మైకుల గోల ఉంటది.ఎవరైనా పెళ్లి చేసుకుంటే పెళ్లిలో బ్యాండ్ మేళాలు,డ్యాన్సులు కేరింతలతో సందడిగా ఉంటది. దీపావళి పండుగ వచ్చిందంటే టపాకాయల మోత. కానీ ఆ గ్రామంలో విందామంటే ఎక్కడ కూడా చప్పుడు వినపడదు.మైకుల గోల ఉండదు.బ్యాండ్ మేళాల చప్పుడు ఉండదు.ఆ ఊరిలో చప్పుడు ఉండదు. అంటే ఆ ఊరిలో చప్పడు అనేది నిషేధం.అందుకే ఆ ఊరిలో ఎవరు కూడా పెళ్లి చేసుకోరు.పెళ్లి చేసుకోవాలంటే బ్యాండ్ మేళాలు ఉండాలి. బ్యాండ్ కొడితే చప్పుడు అవుతుంది.అందుకే ఆ ఊరిలో ఎవరు పెళ్లి చేసుకోరు. ఇంతకూ అది ఏ ఊరు. ఈ రాష్ట్రంలో ఉంది. తెలుసుకుందాం.
కర్ణాటక రాష్ట్రము బెళగావి జిల్లా అవరఖోడా గ్రామం. ఆ గ్రామం లో ఎలాంటి శబ్దాలు వినిపించవు. ఆర్భాటాలు ఉండవు.మైకుల గోల ఉండదు. గ్రామం ఎప్పుడు కూడా నిశ్శబ్దముగానే ఉంటది. వడ్రంగి,కుమ్మరి,కంసాలి,కమ్మరి వాళ్ళు కూడా తమ వృత్తులను గ్రామం బయటనే చేసుకుంటారు.అయినా ఆ ఊరిలో ఎందుకు నిశ్శబ్దం పాటిస్తున్నారు అనేది అనుమానం కదా. ఎందుకంటే ఆ ఊరిలో కొలువైన ఆలయంలో హనుమంతుడు తపస్సులో ఉన్నాడని, శబ్దం చేస్తే హనుమంతుడి తపస్సుకు భంగం కలుగుతుందని నమ్మకం. అందుకే ఆ ఊరిలో ఎలాంటి శబ్దాలు చేయరు. ఒకరితో ఒకరు మాట్లాడు కుంటారు.ఇంటిలో ఉన్న టీవీ చూస్తారు. కానీ శబ్దాలతో కూడిన కార్యక్రమాలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో చేయరు.శబ్దాలు చేస్తే చెడు జరుగుతుందనే నమ్మకంతోనే ఎలాంటి శబ్దాలు చేయరు.అందుకే గ్రామంలో పెళ్లి చేసుకోకుండ, పొరుగూరిలో పెళ్లి చేసుకొని నవదంపతులను గ్రామంలోకి తీసుకువస్తారు.
—————————-
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-