Rats Riding : ప్రతి ఇంటిలో దాదాపుగా ఎలుకల బాధ ఉంటది. ఇంటిలో ఎలుకలు దూరాయంటే ఇబ్బందిగా ఉంటది. దుస్తులు కొరికివేస్తాయి. వాటికీ ఏది కనబడితే వాటిని కొరికేస్తాయి. అంతే కాదు వంటింట్లో దొరితే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముక్యంగా మహిళలు అయితే వాటి వలన అనేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. వంటింట్లో వంట సరుకులను చెడగొడుతాయి. ఈ విదంగా ఇబ్బంది పెట్టె ఎలుకలను ఇంటి నుంచి వెళ్లగొట్టడానికి కొందరు బోను పెట్టి పట్టుకొని బయట వదిలిపెడుతారు. ఇంకా కొందరు ఎలుకల మందు పెట్టి చంపుతారు. అలా కాకుండా సులభమైన పద్దతితో వాటిని ఇంటి నుంచి వెళ్లగొట్టడానికి పలు చిట్కాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మార్కెట్ లో దొరికే పుదీనా నూనె తో ఎలుకను ఇంటి నుంచి వెళ్లగొట్టవచ్చు. పుదీనా నూనె ఘాటైన వాసన ఉంటుంది. దూదితో చిన్న, చిన్న ఉండలు చేసి వాటికి పుదీనా నూనె పట్టించాలి. వాటిని ఎలుకలు తిరిగే ప్రవేశంలో పెడితే వాటి వాసన తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోవడం ఖాయం.
వెల్లుల్లి వాసనను ఎలుకలు తట్టుకోలేవు. ఆ ఘాటైన వాసన వాటికీ తగిలితే అక్కడి నుంచి వెళ్లిపోతాయి. వెల్లుల్లి చేదుగా ఉంటది. వాటిని దంచి నీటిలో కలిపి ఆ నీటిని ఎలుకలు తిరిగే ప్రాంతంలో చల్లండి. ఆ వాసన తగలగానే ఎలుకలు తట్టుకోలేవు. వెంటనే అక్కడి నుంచి పారిపోవడం ఖాయం.
ఆలుగడ్డ పొడి మార్కెట్ లో దొరుకుతుంది. ఆ పొడిని ఎలుకలు తిరిగే ప్రదేశంలో చల్లండి. ఆ పొడి వాసన తట్టుకోలేవు. వాసన తగలగానే ఎంతటి బలమైన ఎలుక అయినా సరే ఇంటినుంచి పారిపోవలసిందే.