Aunty Dance : కొద్ది రోజుల కిందట ఇండిగో విమానంలో ఒక మహిళ తన వ్యక్తిగత పనిమీద ప్రయాణం చేసింది. ప్రయాణికులు తమ తమ సీట్లలో కూర్చున్నారు. కానీ ఆమె మాత్రం కూర్చోలేదు. ఆమె సీట్ ఆమెకు ఉన్నప్పటికీ కూర్చోలేదు. విమానం గాలిలో వెళుతూనే ఉంది. అయినా ఆమె మాత్రం కూర్చోలేదు.
సీట్ల మధ్యలో ఖాళీగా ఉన్న స్థలంలో ఆమె అటు, ఇటు తిరుగుతూ ఉంది. ఒక్కసారిగా ఆ మహిళా ప్రయాణికురాలు డాన్స్ చేయడం మొదలు పెట్టింది. ఒక్కసారిగా విమానంలో ఉన్న ప్రయాణికులు అంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. స్టయిల్, స్టయిల్ అనే పాటకు స్టెప్పులు వేస్తూ డాన్స్ చేసింది. అక్కడితో ఆమె ఆగకుండా వీడియో కూడా తీసింది. ఆ వీడియో తన దగ్గరే ఉంచుకొని మురిసిపోలేదు. తాను డాన్స్ చేసిన వీడియో ను కాస్త ఇంకొకరి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా లో వస్తున్న ఆంటీ డాన్స్ చూసిన వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆంటీ … ఏంటి ఇది నీ ఇల్లు అనుకుంటున్నావా ?. లేదంటే నీ అత్తగారి ఇల్లు అనుకుంటున్నావా ? నీకు అంతగా డాన్స్ చేయాలని ఉంటె నీ ఇంటిలో డాన్స్ చేయి ఆంటీ అంటూ నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.