Laxmi Yogam : కర్కాటక రాశిలో బుధుడు, శుక్రుడు గ్రహాలు ఈనెల ఏడో తేదీ నుంచి 18 తేదీ వరకు కలిసి ఉంటాయి. ఇవి రెండు కూడా శుభప్రదమైన గ్రహాలు. ఇవి రెండు కలిసి ఉంటె ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ధనం, ధాన్యం అభువృద్ది చెందుతుంది. భోగ,భాగ్యాలు పెరిగి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. ఆరు రాశుల వారికి ఆ రెండు గ్రహాల వలన లక్ష్మి యోగం ఉందని పంచాంగ శ్రవణంలో స్పష్టం చేయబడింది.
మేషరాశి : మేష రాశికి చతుర్థ స్థానంలో ఈ రెండు శుభ గ్రహాల యుతి జరుగుతున్నది. ఆ చర్యవలన ధనాదాయం రోజు,రోజుకు అభివృద్ధి చెందుతుంది. వివిధ మార్గాల్లో సంపద పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఇంట్లో పండగ వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగస్టుల హోదా పెరుగు తుంది. చేస్తున్న వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి శ్రమతో అంచనాలకు మించిన ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. గృహ, వాహన యోగం వస్తుంది.
మిథున రాశి : మిథున రాశి వారికి ధన స్థానంలో బుధ, శుక్ర గ్రహాలు కలవడం వలన ఊహించని అభివృద్ధి జరుగుతుంది. పలు ప్రధానమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడుతారు. ఏ ప్రయత్నం చేపట్టినా విజయం వరిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు అనూహ్యమైన అదృష్ట యోగం ఉంది. ఉద్యోగస్టులు పదోన్నతి పొందుతారు. జీతభత్యాలతో కూడిన స్థిరత్వం ఏర్పడుతుంది. మంచి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి బుధ, శుక్ర వారాల్లో సంచారం ప్రారంభమవుతున్నది. ఈ రాశి వారికి తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. చేసే ప్రతి పనీ లాభదాయకమే . లాభదాయక పరిచయాలు కలుగుతాయి. వ్యాపార, ఆస్తి ఒప్పందాలు పెండింగ్ లో ఉంటె పరిస్కారం అవుతాయి. సంపన్న కుటుంబం వారితో వివాహ సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయమే వరిస్తుంది. ఉద్యోగస్టులకు వేతనాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలు చెందుతాయి.
కన్య రాశి: కన్య రాశి వారికి బుధుడు, శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. దింతో ప్రతి పని కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేకుండా పనిచేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది. చేసే ప్రయాణాల్లో మేలు జరుగుతుంది. మంచి మిత్రులు పరిచయం అవుతారు. అనారోగ్యం నుంచి తొందరగా కోలుకుంటారు. కుటుంబంలో శుభకార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. అపరిష్కృతంగా ఉన్న ఇంటి సమస్యలు కూడా పరిస్కారం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
తులా రాశి: తులా రాశి వారికి ఈ రెండు గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన ఉద్యోగస్తులకు సానుకూలమైన మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, భాద్యతలు పెరుగుతాయి. ఆదాయం కలిసివస్తుంది. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు సైతం ఉన్నాయి. నిరుద్యోగులు చేసే ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసివచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యముగా ఉంటారు. చేసే పనితోపాటు, వ్యాపారస్తులకు అదృష్ట యోగం ఉంది.
మకర రాశి : సప్తమ స్థానంలో ఈ రెండు గ్రహాల వారు ఉండటం వలన మకర రాశి సప్తమ స్థానంలో ఉంటుంది. అందుకే ఈ రాశి వారు సమాజంలో ప్రముఖుడిగా పేరు,ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఉన్నత స్థానంలో ఉన్న వారితో స్నేహం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. ఉన్నత కుటుంబం వారితో వివాహ బంధం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు సుఖ, సంతోషాలతో గడుపుతారు.