Air Force Jobs : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంస్థ శుభవార్త ప్రకటించింది. మొత్తం 317 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వేతనం రూ: 1.7 లక్ష. ధరఖాస్తు ప్రక్రియ మొదలైనది. ధరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 2024, జూన్ 26. ఆన్ లైన్ లోనే అధికారిక వెబ్‌సైట్ afcat.cdac.in లోనే ధరఖాస్తు చేసుకోవాలి. ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్), గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్) బ్రాంచ్‌లో ఉన్న ఖాలీలను భర్తీ చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది.
నియామకానికి ముందుగా ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ కు హాజరు కావాలి. కనీసం 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్ లో అభ్యర్థులు తప్పనిసరిగా మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు సైన్స్ స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. వివిధ పోస్టులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని భారత వైమానిక దళంలోని ఫ్లయింగ్ బ్రాంచ్, ఇతర బ్రాంచ్‌లకు ఎంపిక చేస్తారు.
గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ ఉద్యోగాలకు ఇంటర్ లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. అదేవిదంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ విభాగంలో కనీసం నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులు. లేదా కనీసం 60% మార్కులతో ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అసోసియేట్ మెంబర్‌షిప్ సెక్షన్ A & B పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ విభాగంలో మొత్తం 5 బ్రాంచుల్లో పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులు నోటిఫికేషన్ లో ప్రకటించారు.
ఫ్లయింగ్ బ్రాంచ్ ఉద్యోగానికి అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్ లో మ్యాథ్స్, ఫిజిక్స్ 50 శాతం మార్కులు సాధించాలి. ఇంటర్ తో పాటు గ్రాడ్యుయేషన్‌లో ఏదైనా స్ట్రీమ్‌లో 60 శాతం మార్కులు సాధించాలి. 60 శాతం మార్కులతో బీటెక్ ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తు కు అర్హులే. లేదా 60% మార్కులతో ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అసోసియేట్ మెంబర్‌షిప్ సెక్షన్ A & B లో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు.
ఫ్లయింగ్ బ్రాంచ్ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు 20- 24 సంవత్సరాల మధ్య ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ పోస్టులకు వయసు 20-26 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి వేతనం రూ. 56,100 నుంచి రూ.1,77,500 వరకు ఉంటుందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంస్థ ప్రకటించింది.