Air Force Jobs : పెళ్లి కాని నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ పెద్ద శుభవార్త ప్రకటించింది. అవివాహితులు అందరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా ఉతీర్ణులైన వారందరు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఉతీర్ణులైన విద్యార్హతల్లో కనీసం 50శాతం మార్కులు సాధించిన వారందరు కూడా అర్హులే. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకొని, నియామకం అయిన వారందరు కూడా ప్రభుత్వ పరంగా పర్మినెంట్ ఉద్యోగులే అవుతారు. పెళ్లికాని వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
21 ఏళ్లలోపు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 50 శాతం మార్కులతో గణితం, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జె క్టులతో ఇంటర్, మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమాతో సమానమైన విద్యార్హతలు కలిగిన వారు ఎయిర్ ఫోర్స్ ఉద్యోగానికి అర్హులు.
అవివాహితులైన మహిళలు, పురుషులు మాత్రమే అర్హులు. జూలై 28 తేదీలోగా దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ. ఆన్ లైన్ లో రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్ష లో చూపిన ప్రతిభ ఆధారంగా ఫిజికల్, మెడికల్, ఫిట్నెస్ పరీక్షలకు ఎంపిక చేస్తారు. ఆ పరీక్షల్లో ఎంపిక అయిన వారి సరిటిఫికేట్లను పరిశీలించిన తరువాత తుది ఎంపిక చేసి నియామకం సర్టిఫికెట్ అందజేస్తారు. వివరాలకు
www.afnipathvayucdac.in వెబ్ సైట్ ను పరిశీలించాలి.