Bank Job : స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) ఆడిట్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి బ్యాంకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి,ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు SIDBI బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ నుంచి sidbi.in దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ జూలై 29 గా ప్రకటించారు.
SIDBI నియామకం చేయనున్న 6 ఆడిట్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనే ఆసక్తి గల అభ్యర్థుల వయోపరిమితి 35 ఏళ్లు మించరాదు. అటువంటి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఆడిట్ కన్సల్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్‌లో కేటాయించిన సంబంధిత అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.
అభ్యర్థులు దరఖాస్తు ఫారం ను ముందుగా నింపాలి. నింపిన దరఖాస్తును auditvertical_ho@sidbi.inకు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను పంపితే దరఖాస్తు ప్రక్రియ పూర్తిఅయినట్టు.
ఎంపికయిన అభ్యర్థులకు అన్ని అలవెన్సులతో కలిపి ప్రారంభం నుంచే అరవై వేల రూపాయల వరకు వేతనం పొందే అవకాశం ఉందని బ్యాంకు అధికారుల సమాచారం.