కోల్ బెల్ట్ ప్రతినిధి:
మర్రిచెట్టు కింద మర్రి మొక్క మొలవదు. అదేవిదంగా ఎడారిలో ఏ విత్తనం వేసినా మొలవదు.అంతేకాదు చివరకు గడ్డి కూడా మొలవదు.ఎడ్రి అంటేనే ఇసుక దిబ్బలు.ఎటుచూసినా ఇసుకనే కనబడుతుంది.నీరు కనబడదు.విహార యాత్రలకు వెళ్లిన వారు ఇసుక మేటలు చూసి ఆనందపడుతారు.కిలోమీటర్ల కొలది ఇసుకనే కనపడుతుంది.ఒంటెలకు మేత మేయడానికి గడ్డి కూడా కరువే. ఇది ఎక్కడో కాదు సౌదీ అరేబియా లో కనబడే ఇసుక.ఇప్పటివరకు ఆ ఇసుక పై గడ్డి మొలిచిన సందర్భం లేదు.సౌదీ ప్రజలు ఇసుకను చూశారు కానీ,ఇసుకపై గడ్డి మొలిచిన సందర్భాన్ని చూడలేదు.ఇసుకరేణువులపై గడ్డి మొలిపించడానికి అక్కడి ప్రభుత్వం,సంబంధిత శాఖల అధికారులు,శాస్త్రవేత్తలు,వ్యవసాయ శాఖ అధికారులు గత కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు.ఎట్టకేలకు అక్కడి ఇసుక ఎడారి ప్రాంతాల్లో గడ్డి మొలిపించడంలో పరిశోధనలు చేసిన వారి కృషి ఫలించింది. ఎటుచూసినా ఇసుక కనిపించే దృశ్యాలు మాయమైపోయాయి.ఇప్పుడు ఆ ప్రదేశాల్లో ఇసుకకు బదులుగా పచ్చని గడ్డి కనిపిస్తోంది.. దింతో అక్కడి ప్రజల్లో ఎనలేని ఆనందం వ్యక్తం అవుతోంది.సౌదీ ప్రజల జీవనాదారానికి ఉపయోగపడే ఒంటెలకు ఆహారంగా గడ్డి లభిస్తోంది.ఇప్పుడు అక్కడి ప్రజలు ఒంటెలను పెంచడానికి ఉత్సహం చూపుతున్నారు. ఇన్నేళ్లు ఒంటెలకు ఆహారం అందించడానికి వాటి యజమానులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు వారికీ ఆ కష్టాలు తప్పినవి. ఇప్పుడు ఎడారిలో వర్షాలు కురుస్తున్నాయి. గడ్డి మొలుస్తున్నది.ఇది చూసిన శాస్త్రవేత్తలు
మొన్నటి వరకు ఇసుకతో కనబడిన ప్రదేశాలు ప్రస్తుతం చిన్న,చిన్న మొక్కలు,పచ్చని గడ్డి కనిపిస్తోంది.దీనికి సంబందిచిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాధారణ జనంతో పాటు,శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఎడారిలో గడ్డి మొలిచింది.ఒంటె అదే గడ్డిని మేస్తోంది అంటే నమ్మలేకుండా ఉంది.ఒంటెనే మరో ప్రదేశంలోకి వెళ్లి గడ్డి మేస్తోంది అనే విదంగా
ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-