Runamafi list : కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రైతుల తీసుకున్న రెండు లక్షల రుణాన్ని ఒకేసారి మాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. ఆ హామీని ఆగష్టు 15 తేదీలోగా అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేశారు. అందుకు తగిన విదంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముందుగా ఒక లక్ష ఋణం తీసుకున్న రైతులకు మాఫీ చేసింది. ఇప్పుడు రెండో దఫా లక్షా యాబై వేల రూపాయల రుణాన్ని మాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైనది.
రెండోసారి మాఫీ చేయబోతున్న రుణమాఫీకి సంబందించి లిస్ట్ కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. జూలై నెలాఖరులోగా రూ: 1.50 లక్షల ఋణం తీసుకున్న రైతులందరికీ వడ్డీతో సహా రైతుల బ్యాంకు ఎకౌంట్ లో జమచేయడానికి ప్రభుత్వం సిద్దమైనది. ఆగష్టు 15 తేదీలోగా రెండు లక్షల రుణాన్ని మాఫీ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. తాజాగా లక్షన్నర ఋణం తీసుకున్న రైతుల రుణాన్ని మాఫీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు.
రాష్ట్రంలోని అర్హత ఉన్న రైతులందరి రుణాలను తప్పకుండ మాఫీ చేస్తామని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావ్ ఇటీవలనే స్పష్టం చేసారు. రైతులు కూడా ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని మంత్రి కోరారు. లక్ష వరకు ఋణం తీసుకున్న రైతుల్లో కొందరికి మాఫీ కాలేదు. అటువంటి వారికి కూడా రెండో లిస్టులో పేరు నమోదు చేసి ఋణం మాఫీ చేస్తామని అధికారులు ప్రకటించారు.
రెండో విడుత రుణమాఫీకి సంబందించిన లిస్ట్ ప్రభుత్వం సిద్ధం చేసింది. అందుకు అర్హులైన రైతుల జాబితాను సంబంధిత శాఖల అధికారులు సిద్ధం చేశారు. రుణమాఫీకి సంబంధించింన రెండో లిస్ట్ ను ఈ నెల 29 న అధికారికంగా రాష్ట్రప్రభుత్వం విడుదల చేయదానికి సిద్దమైనది. ప్రభుత్వ వెబ్ సైట్ లో https://clw.telangana.gov.in/Login.aspx రైతులు తమ పేర్లను చూసుకోవాలి.