Rocky Festival : తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ ఇంటిలో రాఖీ పండుగ ఆనందంగా ముగిసింది. కేటీఆర్ సోదరి ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైలు లో ఉంది. ఈసారి కేసిఆర్ కుటుంబలో కవిత లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో కవిత కుటుంబ సభ్యులు అంతా కూడా పండుగ జరుపుకోడానికి దూరంగానే ఉన్నారు.
ప్రతి ఏటా కేటీఆర్, కవిత పండుగ రోజు ఆనందంగా గడిపేవారు. స్వయంగా కవిత కేటీఆర్ ఇంటికి వచ్చి రాకీ కట్టి కేటీఆర్ ఆశీర్వాదం తీసుకునేవారు. కుటుంబం అంత కలిసి ఆనందంగా గడిపేవారు. చెల్లులు ఈ సారి తన ఇంటికి వచ్చి రాఖీ కట్టే పరిష్టితి లేకపోవడంతో కేటిఆర్ కొంత ఇబ్బందిగానే కనిపించారు.
పండుగ పురస్కరించుకొని చెల్లెలు వరుస ఉన్న వారు కేటీఆర్ ఇంటికి వచ్చి ఆయనకు రాఖీ కట్టారు. సుమారు ఇరువై మందికి పైగా చెల్లెలు వరుస ఉన్న వారు కేటీఆర్ కు రాఖీ కట్టారు. అయినప్పటికీ కేటీఆర్ చెల్లెలు కవిత లేకపోవడంతో మనసులో ఉన్న భాదను దిగమింగుకున్నారు. చెల్లెలు బెయిల్ పై రాగానే రాఖీ కట్టించుకుంటానని కుటుంబ సభ్యులతో కేటీఆర్ అన్నట్టు సమాచారం.