CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయపతాకాన్ని ఎగురవేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎం కుర్చీ కోసం పోటీ ఏర్పడినప్పటికీ ఢిల్లీ లోని కాంగ్రెస్ పెద్దలు రేవంత్ రెడ్డి కే సీఎం పగ్గాలు అప్పగించారు. సీఎం గ భాద్యతలు చేపట్టిన నాటి నుంచే ఆయన పరిపాలనపై దూకుడు పెంచారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. కొన్నింటిని అమలు చేయగా, మరికొన్ని దశల వారీగా అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఎన్నికల హామీలల్లో ప్రధానమైనది రైతు రుణమాఫీ రెండు లక్షలు. ఇది ప్రభుత్వానికి పెద్ద భారమైన హామీ. ఆర్థిక ఇబ్బందులు ఎదురై నప్పటికి మూడు దశల్లో రైతు రుణమాఫీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డి కి మంచి పేరు తెచ్చి పెట్టింది. అదేవిదంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలైనది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కి పేరు తెచ్చిపెట్టాయి.
సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన పగ్గాలు చేతపట్టి 250 రోజులు పూర్తయినది. రేవంత్ రెడ్డి కి ఉన్నది ఐదేళ్ల పదవీ కాలం. అందులో 250 రోజులు అతి తక్కువ సమయం. ఈ 250 రోజుల పరిపాలనపై ఒక ప్రైవేట్ సంస్థ సర్వే చేపట్టింది. గతంలో బిఆర్ఎస్ పరిపాలనపై కూడా ప్రజల్లో ఆ సంస్థ సర్వే చేసింది. బిఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన ఐదేళ్ల కాలాన్ని సద్వినియోగం చేసుకోలేదని సర్వేలో తేలింది. కేసీఆర్ అమలు చేసిన రైతు రుణమాఫీ హామీ సక్రమంగా అమలు కాలేదని, రేవంత్ రెడ్డి రుణమాఫీ పై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో నిరుద్యోగులకు కేసీఆర్ హయాంలో నష్టం జరిగిందన్నారు. ఐదేళ్ల కేసీఆర్ పరిపాలన కంటే 250 రోజుల రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని ఆ ప్రైవేట్ సంస్థ సర్వేలో ప్రజలు వెల్లడించారు.