Home » Next Hydra : హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఆ ఇద్దరు ?

Next Hydra : హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఆ ఇద్దరు ?

Next Hydra : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమ నిర్మాణాలపై తీసుకున్న నిర్ణయం బెడిసికొడుతుందనే అభిప్రాయాలు మొదట వ్యక్తమయ్యాయి. కానీ హైదరాబాద్ లో ఎన్ని ఫ్లై ఓవర్ లు కట్టినా రాని మైలేజ్ అక్రమ కట్టడాల కూల్చివేతతో రేవంత్ రెడ్డి కి వచ్చేసింది. ప్రజలు అభివృద్ధిని ఏ దృష్టితో చూస్తారో, అక్రమాలు, అవినీతిని కూడా అదే కోణంలో చూస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క అభ్యర్థిని కూడా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో గెలిపించుకోలేక పోయింది. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లోపంతోనే అభ్యర్థులు ఓటమి చెందారనే ఆరోపణలు పార్టీ శ్రేణులు వ్యక్తం చేయడం విశేషం.

రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయం సాధిచడానికే సీఎం జంట నగరాలపై దృష్టి పెట్టారు. మెట్రో రైలు విస్తరణ, నాలుగో నగరానికి శంకుస్థాపన, ఐటి సంస్థలను ఆహ్వానించడం, పెట్టుబడుల కోసం విదేశీ పర్యటన కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకువచ్చారు. ఇవన్నీ నాణానికి ఒక ఎత్తు అయితే హైడ్రా ఏర్పాటు చేయడం మరో ఎత్తు. హైడ్రా కు చైర్మన్ గా సీఎం ఉండి, కమిషనర్ గా సీనియర్ పోలీస్ అధికారి రంగనాథ్ ను నియమించడం తో హైడ్రా ఎక్కడ కూడా పట్టు తప్పలేదు.

అక్రమ కట్టడాల విషయంలో ప్రజల మద్దతు వస్తుందని సీఎం ముందే పసిగట్టారు. ఉద్యోగ వర్గాల మద్దతు కూడా సంపూర్నంగ లభిస్తుందని సీఎం ఆశించారు. కోర్ట్ పరిధిలోకి వెళ్లకుండా సీఎం చట్ట పరంగా హైడ్రాను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా హైడ్రను అడ్డుకోవడం ఎవరి తరం కావడం లేదు.

ఇప్పుడు హైడ్రా చేతిలో ఉన్న అక్రమ కట్టడాల జాబితాలో మరో ఇద్దరు చోటు సంపాదించారు. ఇద్దరు కూడా బిఆర్ఎస్ నాయకులే కావడం విశేషం. ఆ ఇద్దరిలో ఒకరు ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఈయనకు జంట నగరాల్లో పలు విద్యాసంస్థలు ఉన్నవి. వాటిలో పలు సంస్థలు అక్రమ కట్టడ జాబితాలో ఉన్నట్టు హైడ్రా పరిశీలనలో తేలింది. ఇప్పుడు వాటిని కూల్చబోతున్నట్టుగా నోటీసు ఇచ్చినట్టు అధికార వర్గాలతో పాటు రాజకీయ వర్గాల సమాచారం.

అదేవిదంగా మరో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి సంస్థలపై కూడా హైడ్రా దృష్టి సారించింది. రాజేశ్వర్ రెడ్డి కి కూడా పలు సంస్థలు ఉన్నవి. అవి కూడా అక్రమ కట్టడాలుగా హైడ్రా గుర్తించింది. వాటిని కూడా కూలగొట్టబోతున్నామని హైడ్రా నోటీస్ లు ఇచ్చినట్టు అధికార వర్గాల సమాచారం.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *