Home » రాజస్థాన్ జట్టు క్యాప్టెన్ సంజూ శాంసన్ కు భారీ జరిమానా

రాజస్థాన్ జట్టు క్యాప్టెన్ సంజూ శాంసన్ కు భారీ జరిమానా

sanjoo shamsun penalty: IPL 17వ సీజన్ క్రికెట్ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. అభిమానుల్లో మ్యాచ్ జరిగినంత వరకు ఉత్కంఠ. అభిమాన క్రికెటర్ అనుకున్నన్ని పరుగులు సాధిస్తే ఓకే, లేదంటే నిరాశే. కానీ అంతకంటే ఎక్కువే నిరాశే ఎదురైనది రాజస్థాన్ జట్టు క్యాప్టెన్ సంజూ శాంసన్ విషయంలో. IPL 17 మ్యాచ్ లో ఢిల్లీ జట్టు తో రాజస్థాన్ జట్టు తలపడ్డాయి. ఈ పోరులో రాజస్థాన్ జట్టు ఇరువై పరుగులు తేడాతో ఓటమి చెందిన విషయం తెలిసిందే. రాజస్థాన్ క్యాప్టెన్ సంజూ శాంసన్ ఒక్కడే 86 పరుగులు చేశాడు. అయినప్పటికీ రాజస్థాన్ జట్టుకు ఓటమి తప్పలేదు. శాంసన్ ఔట్ అయిన తీరు వివాదంగా మారింది. తాను అవుట్ అయిన నిర్ణయంపై అంపైర్ తో శాంసన్ గొడవకు దిగాడు.

మ్యాచ్ ముగిసిన అనంతరం IPL సలహా కమిటీ ఈ గొడవ పై విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా సంజూ శాంసన్ కు భారీ జరిమానా విధించింది సలహా కమిటీ. ఇందుకు సంబందించిన ప్రకటనను కూడా కమిటీ విడుదల చేయడం విశేషం. IPL రాజస్థాన్ రాయల్స్ జట్టు క్యాప్టెన్ సంజూ శాంసన్ కు మ్యాచ్ ఫీజు లో 30 శాతం జరిమానా విధించినట్టుగ కీలక ప్రకటనను కమిటీ విడుదల చేసింది. IPL అమలుచేస్తున్న నిబంధనలకు సంజూ శాంసన్ కట్టుబడి ఉండకపోవడమే ప్రధాన కారణమని కమిటీ పేర్కొంది. అదేవిదంగా మ్యాచ్ రిఫరీ తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఫైన్ అమలుచేసినట్టు సలహా కమిటీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *