Home » Nara Lokesh ; టీడీపీ భాద్యతలు ఆయనకే ఖరారు ….

Nara Lokesh ; టీడీపీ భాద్యతలు ఆయనకే ఖరారు ….

Nara Lokesh ; తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. తెలుగు దేశం పార్టీ ఏర్పాటు చేసుకున్న కూటమి అధికారంలోకి వస్తే ఎవరు మంత్రి అవుతారు. ఎవరెవరికి ఏ హోదా ఉన్న మంత్రి వర్గంలో చోటు దొరుకుతుంది. ఒకవేళ మంత్రి వర్గంలో బెర్త్ దొరకని వారికి ఎలాంటి పదవి వస్తుంది. కార్పొరేషన్ పదవితో సరిపెడుతుంది పార్టీ. ఇది ఇలా ఉండగా పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి భాద్యతలు ఎత్తుకుంటారు.

అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం పదవితో పాటు పార్టీ అధ్యక్ష భాద్యతలను నిర్వర్తించడం సాధ్యం కాదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఆయన వయసు రీత్యా కూడా రెండు పదవులకు న్యాయం చేయలేడు. పార్టీని సమర్థవంతంగా నడపాలి. అంతేకాదు రాబోయే రోజుల్లో పార్టీ పరంగా కూడా వైసీపీ అధినేతను కూడా దీటుగా ఎదుర్కోవాలి. కాబట్టి సమర్ధవంతమైన నాయకుడు పార్టీ ని నడిపించడానికి పార్టీ వేటలో పడింది

పార్టీ అధికారం చేపడితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతారు. అప్పుడు లోకేష్ పరిస్థితి ఏమిటనేది పార్టీ శ్రేణుల్లో తలెత్తింది. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా లోకేష్ పాత్ర ఎలా ఉండబోతున్నదనేది పెద్ద ఫజిల్ . పార్టీకి 2009 వరకు అంతర్గతంగా ఉండి అభివృద్ధికి కృషిచేశారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. 2017 లో మంత్రిగా భాద్యతలు చేపట్టారు. అతి చిన్న వయసులోనే పలు కీలకశాఖలను సమర్థవంతంగా నిర్వహించి పేరు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ సాధించి ఉంటె లోకేష్ సీఎం అయ్యే పరిస్థితి ఏర్పడేది అనే అభిప్రాయాలు సైతం పార్టీ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.

లోకేష్ ని మంత్రివర్గంలోకి తీసుకోకుండా పార్టీ భాద్యతలను అప్పగిస్తారనే ప్రచారం పార్టీలో సాగుతోంది. వయసురీత్యా చంద్రబాబుకు పార్టీ తో పాటు ప్రభుత్వాన్ని నడపటం సాధ్యం కాదు. వైసీపీ కి చిక్కకుండా, జనసేనను మెప్పిస్తొ పరిపాలన నిర్వహించాలి. కాబట్టి పార్టీ భాద్యతలను లోకేష్ కు అప్పగించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని లోకేష్ పాదయాత్ర చేసి ప్రజలకు చేరువయ్యారు.

పార్టీ శ్రేణులతో వీలు చేసుకొని సమీక్షలు, సమావేశాలు చేపట్టారు. పార్టీ అగ్ర శ్రేణులకు దగ్గరయ్యారు. 2019 ఎన్నికలతోపాటు, తాజా ఎన్నికల్లో కూడా అభ్యర్థుల ఎంపిక లో భాగస్వాములయ్యారు. ఎన్నికల ప్రచారం చేపట్టి సీనియర్ రాజకీయ నాయకులను మెప్పించారు. 2019 ఎన్నికల్లో లోకేష్ చేసిన ప్రసంగాల కంటే , 2024 ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రసంగాలకు ఎంతో తేడా కనబడింది. పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే లోకేష్ టీడీపీ భాద్యతలను ఎత్తుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.

 

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *