Railway station : ప్రైవేట్ యూనివర్సిటీ లు వచ్చినవి. ప్రైవేట్ ఆసుపత్రులు ఏర్పాటైనవి. కానీ ప్రైవేట్ రైల్వే స్టేషన్ కూడా వచ్చిన విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అవును నిజమే. ఎక్కడో కాదు మనదేశంలోనే. ఎక్కడ నిర్మించారో ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లోని కమలాపతి రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ పూర్తి స్థాయిలో ప్రయివేట్ సంస్థ చేతిలో నడుస్తోంది. జర్మనీలోని హైడెల్‌బర్గ్ రైల్వే స్టేషన్ నమూనాలో ఈ స్టేషన్ ను ఆధునికంగా నిర్మించారు. పబ్లిక్-పార్ట్నర్షిప్-ప్రైవేట్ (PPP ) పద్దతిలో నిర్మించారు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లన్నీ కూడా ఈ స్టేషన్ నుంచే ప్రయాణిస్తాయి.
160 సీసీ కెమెరాలతో స్టేషన్ ను నిత్యం పర్యవేక్షిస్తారు. దొంగల బెడద లేకుండా అడుగడుగునా భద్రతా సిబ్బంది. సుమారుగా వెయ్యి మంది ప్రయాణికులు కూర్చునే విదంగా హల్ నిర్మించారు. ఈ స్టేషన్ లో లేని సౌకర్యం అంటూ లేదు. దేశంలో ఎక్కడ లేనివిదంగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ స్టేషన్ ప్రయాణికులను ఎంతో ఆకట్టుకుంటోంది.