Home » వాస్తు నిపుణులతో కేసీఆర్

వాస్తు నిపుణులతో కేసీఆర్

…తెలంగాణ భవన్ లో వాస్తు మార్పులు
…వాయవ్యం గేట్ వద్దు
…ఈశాన్యం గేట్ నుంచే నడవాలి
———————
కోల్ బెల్ట్ న్యూస్:హైదరాబాద్
———————

భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు,కార్యకర్తలు పదేళ్ళపాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కొనసాగారు.ఒక్కసారిగా అధికారం కోల్పోవడంతో పార్టీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారు.పార్టీ శ్రేణులే కాదు కేసీఆర్ కూడా ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారనే అభిప్రాయాలు పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి.హోమం,వేదాలు,ప్రత్యేక పూజలు చేయడంలో కేసీఆర్ సిద్ధహస్తుడు. అడుగుతీసి అడుగు వేయాలంటే కూడా ముహూర్తం చూడాల్సిందే. కొత్తగా ఏదయినా కట్టాలన్న, పాత భవనాన్ని కూలగొట్టాలన్న ముహూర్తం చూడంది కేసీఆర్ ఆ పని ప్రారంభించడు అనే పేరు ఉంది.కొత్త భవనం కట్టాలన్న కూడా వాస్తు నిపుణులతో ఒకటికి పదిసార్లు ఆలోచన చేస్తాడు కేసీఆర్.

వెళ్ళిపోతున్న నాయకులు……

పార్టీ అధికారం కోల్పోవడంతో ఓడిపోయిన నాయకులు పార్టీ విడిచి వెళుతున్నారు.ఓడిపోయినవారు పోతే ఇబ్బందేమిలేదు కానీ,గెలిచిన వారు వెళుతున్నారు.ఎంపీ టికెట్ ఇచ్చినవారు పార్టీని కాదంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసేనాటికి అసలు పార్టీలో ఎందరు కొనసాగుతారు అనేది పార్టీ ప్రధాన నాయకులకు పెద్ద ఫజిల్ అయ్యింది.నామినేషన్ కు ముందు అన్ని బి ఫారం లతో ప్రత్యేక పూజలు చేసిన విజయం సాధించలేకపోయాం. పలు విధాలుగా సర్వే చేయిస్తే పార్టీకే అనుకూలమని తేలింది.అయినా పార్టీ అధికారం చేపట్టలేదు.లోపం ఎక్కడ ఉందనే ఆలోచనలో పడిపోయారు కేసీఆర్

తెలంగాణ భవన్ లో వాస్తు దోషాలు……

ముందుగా తెలంగాణ భవన్ పై మాజీ సీఎం దృష్టి సారించినట్టుగా పార్టీశ్రేణుల సమాచారం.పదేళ్ల అధికారం పోవడంతో కేసీఆర్ వాస్తునిపుణులతో సంప్రదింపులు చేస్తున్నాడని తెలిసింది.పార్టీ ప్రధాన కార్యాలయ మయిన తెలంగాణ భవన్ వాస్తు దోషాలపై చర్చలు జరిపినట్టుగా తెలిసింది. తెలంగాణ భవన్ ను తూర్పుకు అభిముఖంగా నిర్మించారు.పార్టీ కార్యాలయానికి రావడానికి ఈశాన్యం గేట్, వాయవ్యం గేట్ రెండుచోట్ల ఏర్పాటు చేసారు.కానీ ఈశాన్యం గేట్ నుంచి కాకుండా, వాయవ్యం గేట్ నుంచి ఇన్నేళ్ల నుండి కేసీఆర్ నుంచి మొదలుకొని కార్యకర్త వరకు రాకపోకలు నిర్వహిస్తున్నారు.పార్టీ కార్యాలయానికి వీధిపోటు పడకుండా ఉండేందుకు లక్ష్మి నరసింహస్వామి ఫోటో కూడా ఏర్పాటు చేశారు.వాయవ్యం గేట్ నుంచి రాకపోకలు నిర్వహించరాదని,ఈశాన్యం ద్వారం ఉండగా వాయవ్యం నడక మంచిది కాదని వాస్తు నిపుణులు స్పష్టం చేసినట్టుగా తెలిసింది.ఈ నేపథ్యంలో వాయవ్యం గేట్ ను మూసివేస్తున్నారు.ఇప్పటి నుంచి ఈశాన్యం గేట్ నుంచే పార్టీ నాయకులు,కాయకర్తలు ప్రతి ఒక్కరు రాకపోకలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించినట్టుగా పార్టీ వర్గాల సమాచారం.

—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

 

 

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *