ఆ మిత్రులు ఆపద్బాంధవులు
——————
కోల్ బెల్ట్ న్యూస్ :మంచిర్యాల
——————
ఆ మిత్రులందరిది ఒకే ఊరు.వారందరు చిన్ననాటి నుంచి స్నేహితులు.అందరు కలిసి ఒకే బడిలో కలిసి చదువుకున్నారు.ఒకే బడి.ఒకటే తరగతి గది. ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. చిన్ననాటి నుంచే ఎవరి ఇంటిలో ఏ కార్యక్రమం జరిగినా అందరు కలిసే వెళుతారు. కార్యక్రమంలో సహాయం చేసుకుంటారు. కష్టంలో ఉన్నా, ఆపదలో ఉన్నా ఆదుకోవడం వారికి చిన్న నాటి నుంచి వచ్చిన లక్షణం.అదే స్ఫూర్తి తో మంచిర్యాల పట్టణంలోని పాత మంచిర్యాలకు చెందిన స్వర్గీయ నాగమల్ల శ్రీనివాస్ కూతురు చి.ల.సౌ. నాగరాణి కి వివాహం కుదిరింది.తండ్రి లేని లోటు రానివ్వకుండా ఆ స్నేహితులంతా కలిసి మేము ఉన్నామంటూ ముందుకు వచ్చారు.మిత్రులంతా కలిసి పద్నాలుగు వేల రూపాయలు మిత్రుని కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో మిత్రులు బొలిశెట్టి కిషన్,బొలిశెట్టి రాజన్న,రాయిలి మల్లేష్,కళ్ళు రాజలింగు,రామగిరి శంకర్,కమటం హరికృష్ణ ఉన్నారు.