Home » ఉగాది పండుగ రోజు ఆ దేవుళ్లను పూజించాలి

ఉగాది పండుగ రోజు ఆ దేవుళ్లను పూజించాలి

కోల్ బెల్ట్ న్యూస్:

ప్రతి ఏడాది ఛైత్ర శుద్ధ పాడ్యమి రోజున హిందువులందరూ ఉగాది పండుగను ఆనందంగా జరుపుకుంటారు. అదేరోజు నుండి సృష్టి కూడా మొదలైనదని చరిత్ర చెబుతోంది.పండుగరోజు సూర్యోదయంకు ముందే నీటిలో నువ్వుల నూనె కలుపుకొని స్నానం చేయాలి. సాధ్యమైనంతమేరకు కొత్త దుస్తులు లేదా ఉతికిన దుస్తులు ధరించాలి.ఇంటిలోని ప్రతి గడపను పసుపు,కుంకుమలతో అలంకరించాలి. ప్రతి గుమ్మానికి మామిడి ఆకులు కట్టాలి.ఇంటిముందర రంగులతో ముగ్గులు వేయాలి. దింతో పండుగ ప్రారంభం అవుతుంది.ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు.ఈ రోజు నుంచి సృష్టి మొదలైందని చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి.

హిందువులు జరుపుకునే పెద్ద పండుగల్లో ఉగాది పండుగ కూడా ఒకటి కావడం విశేషం. పండుగ రోజు నుంచే తెలుగు మాసాలతో క్యాలండర్ ప్రారంభం అవుతుంది. ఉగాది పండుగ అంటేనే కొత్త సంవత్సరం. పండుగ రోజు ఇల్లంతా సందడిగా ఉంటుది.పలు ప్రాంతాల్లో ఉగాదిని యుగాది అని కూడా పిలుస్తారు. పండుగ రోజు ప్రధానంగా బొప్పట్లు చేసుకోవడం,పచ్చడి చేయడం,సాయంత్రం వేళ గుడిలో వేద బ్రాహ్మణులచే పంచాంగ శ్రవణం చేయడంతో ఆరోజుతో పండుగ ముగుస్తుంది.పండుగరోజు కుటుంబ సభ్యులు నమ్ముకున్న దేవుళ్ళకు ప్రత్యేక పూజలుచేయాలి.ఆ దేవుళ్ళకు సంభందించిన వేదమంత్రాలు,శ్లోకాలు అందరు చదవాలి.

ఆ విదంగా పూజలు చేసిన అనంతరం చింతపులుసు,మామిడి ముక్కలు,కొబ్బరి ముక్కలు,వేపపువ్వు,బెల్లం పానకం తో తాయారు చేసిన పచ్చడితోపాటు, బొప్పట్లు (బూరెలు)దేవుళ్ళ వద్ద నైవేద్యముగా పెట్టి,దీపం వెలిగించి హారతి ఇవ్వాలి.అనంతరం కుటుంభసభ్యులందరు బొప్పట్లు తింటూ,పచ్చడి సేవించాలి.ఉగాది పండుగ రోజు ఎంతో కొంత ఆదాయం వచ్చే పని చేసినచో ఆ ఆదాయ ప్రభావం మల్లి ఉగాది పండుగ వచ్చే వరకు ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు.పండుగ రోజు సాయంత్రం సమీపంలోని గుడికి వెళ్లి తమ జన్మనామం ప్రకారం జాతకం తెలుసుకోవాలి. ఆ జాతక ప్రకారం ఏడాది పాటు జరిగే లాభ, నష్టాలు, మంచి,చెడు తెలిసిపోతుంది.కొత్త తెలుగు సంవత్సరం రోజున పంచాంగం వినితీరాలని పండితులు చెబుతున్నారు.

—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

 

 

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *