CPM : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనాయని సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకే ఆరోపించారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి జిల్లా లోని తాండూర్ మండలం నర్సాపూర్ గ్రామపంచాయితీ పరిధిలోని సోయం లచ్చు పటేల్ గూడెంను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన గ్రామంలో పర్యటించిన అనంతరం మాట్లాడుతూ……
ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామానికి వెళ్లే దారిలో వేసిన తాత్కాలిక వంతెన కొట్టుకు పోవడంతో గ్రామస్తులు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరుసగా కురిసిన వర్షాలకు ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. ఒకవైపు వర్షాలు, మరోవైపు వంతెన కొట్టుకు పోవడంతో పనులకు వెళ్లలేక, వంట సరుకులు తెచ్చుకోలేక గ్రామస్తులు సతమతమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామ సమస్యలను అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలిసినప్పటికీ స్పందించకపోవడం పై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదివాసీలంటేనే చులకనభావం ఉందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో కూడా ఆదివాసీల సమస్యలను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి లచ్చు పటేల్ గూడెం సమస్యలను పరిష్కరించాలని లేనిచో గ్రామం నుంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు ప్రదర్శన చేపడుతామని సంకె రవి ఈ సందర్బంగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో దాగం రాజారాం తాండూరు మండల కార్యదర్శి, బొల్లం రాజేశం మండల కమిటీ సభ్యులు, నాయకులు జేనేని రాజయ్య, గ్రామ మాజీ సర్పంచ్ కుర్శింగ బాపురావు తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు, ఆదివాసీలు,ఆత్రం బాదిరావు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS) మండల కన్వీనర్ సొయం గంగారాం గ్రామ పటేల్,సోయం పార్వతి రావు,కడం వెంకటేష్, కుర్షింగ చిన్ను పెంద్రం మారుతి, తుమ్రం జంగు, ఆత్రం శివ ప్రసాద్,సొయం ఈశ్వరి,కుర్శింగ విజయ లక్ష్మి,కుర్షింగ జంగు బాయి,ఆత్రం బిజుల పాల్గొన్నారు

by