MLA : ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి పై జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య గొడవ జరిగింది విదితమే. ఒక సందర్భంలో సంజయ్ ను కౌశిక్ రెడ్డి తోసివేయడం కూడా జరిగింది. ఈ సంఘటనపై అక్కడే ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు కౌశిక్ రెడ్డి ప్రవర్తన పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అదే విదంగా తన పట్ల కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేశారు. ఈ రెండింటితో పాటు సమావేశాన్ని పక్కదారి పట్టించినందుకు ఆర్డీఓ మహేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా మరో కేసు నమోదు చేశారు.
మొత్తం మీద ఒక్క రోజు గొడవతో హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద మూడు పోలీస్ కేసులు నమోదయినాయి.