Jagruthi : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గత కొద్ది రోజుల నుంచే జాగృతి పేరు ఎక్కువగా ప్రజల్లో నానుతోంది. జాగృతి ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ లో ప్రారంభించారు. ఇటీవలనే జాగృతి నాయకులకు, కార్యకర్తలకు రాజకీయ శిక్షణ కార్యక్రమాలను చేపట్టారు కవిత. ప్రజల సమస్యల పై ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలి. నిరసన కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించాలి. మీడియా ముందు ఎలా మాట్లాడాలి అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు.
తెలంగాణ జాగృతి విస్తరణ ను ఎమ్మెల్సీ కవిత చాలా పకడ్బందీగా చేపట్టారు. విదేశాల్లో ఉన్న వారికి కన్వీనర్లుగా భాద్యతలు అప్పగించారు. కానీ వారంతా కూడా గులాబీ శ్రేణులే కావడం విశేషం. కన్వీనర్ పదవులు అప్పగించడంతో జాగృతి నాయకులు అయ్యారు. కవిత కూడా ఎంపీ, ఎమ్మెల్సీ గా గెలిచింది కూడా బిఆర్ఎస్ టికెట్ తోనే. కానీ ఆమె జాగృతి పేరుతొ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు.
కవిత ఇప్పటికే సింగరేణి లో అడుగుపెట్టింది. ఏ చిన్న తప్పు దొరికినా ప్రభుత్వాన్ని వదలడంలేదు. ఒంటరిగానే పోరాటం చేస్తోంది. ఆ పోరాటంలో బిఆర్ఎస్ శ్రేణులు మాత్రం పాల్గొనడం లేదు. పరిస్థితిని మాత్రం గమనిస్తున్నారు. కవిత జాగృతి పేరుతొ చేస్తున్న కార్యక్రమాలు పార్టీకి తలనొప్పిగా తయారైనాయి. జిల్లా, మండల రాష్ట్ర స్థాయిలో పార్టీ ఎలాంటి కార్యక్రమాలు పార్టీ చేపట్టడంలేదు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం పునరాలోచనలో పడినట్టుగా వార్తలు రావడం కొసమెరుపు.
పొలిటికల్ బ్యూరో
కొమ్మెర అనిల్ కుమార్, ఎమ్మే, బీఎడ్