Good News : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆరు హామీలను ఇచ్చింది. ఆరు పతకాలను అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్, విద్యుత్ , రైతు రుణమాఫీ పథకాలను అమలు చేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు పథకాలను ప్రారంభించడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే అధికారులతో పలుదఫాలుగా మిగిలిన హామీలను అమలుచేయడానికి చర్చలు జరిపారు. లబ్ధిదారుల ఎంపిక, ఆ రెండు పథకాలకు నిధుల సేకరణ అంశాలపై సంబంధిత శాఖల అధికారులు కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ రెండు హామీలను దసరా రోజు ప్రకటించడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారని అధికార వర్గాల సమాచారం.
రైతు భరోసా పథకానికి ఎకరానికి ఒక పంటకు 7,500 ఇస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడం జరిగింది. కేవలం సాగుచేసుకుంటున్న భూములకు మాత్రమే ఇవ్వాలని సీఎం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయించింది. బిఆర్ఎస్ పరిపాలనలో పాస్ పుస్తకం, బ్యాంకు అకౌంట్ ఉంటె చాలు రైతు బందు వచ్చేది. కానీ ఇప్పుడు అందుకు విరుద్దంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కేవలం పంట పండుతున్న భూములకు మాత్రమే పెట్టుబడి సహాయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఐదు ఎకరాలకు ఇవ్వాలనేది ఒక నిర్ణయం కాగా, పది ఎకరాలకు ఇవ్వాలనేది మరొక నిర్ణయంగా సమాచారం. కానీ ఇంకా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది కచ్చితంగా నిర్ణయం కాలేదు.