CM Revanth Reddi : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2017లో కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో చేరిన తరువాత కొద్ధి రోజులకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భాద్యతలు చేపట్టారు. 7 జులై, 2021 న పార్టీ రాష్ట్ర అధ్యక్ష భాద్యతలను ఎత్తుకున్నారు. అప్పటి నుంచి కేసీఆర్ లక్ష్యంతో పార్టీ అధ్యక్షుడి హోదాలో దూకుడు పెంచారు. కాంగ్రెస్ పార్టీ అదికారమే లక్ష్యముగా భాద్యతలు నిర్వహిస్తూ వచ్చారు. నవంబర్, 2023 లో పీసీసీ అధ్యక్షుడి హోదాలోనే ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పదేళ్ల తరువాత కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడి రేవంత్ రెడ్డి హయాంలో అధికారంలోకి వచ్చింది.
సీఎం గా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఒకవైపు పార్టీ రాష్ట్ర పగ్గాలు, మరోవైపు పరిపాలన భాద్యతలు రెండూ నిర్వహిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడి భాద్యతలతోనే పార్లమెంట్ ఎన్నికల భాద్యతలను ఎత్తుకున్నారు. పార్టీ భాద్యతలు ఎత్తుకొని మూడేళ్లు పూర్తి కావొస్తోంది. మరి కొద్ధి రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉండాలని సీఎం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కాగానే సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారని పార్టీ వర్గాల సమాచారం.
సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలను ఎవరికి అప్పగించనున్నారనే చర్చ అప్పుడే పార్టీ శ్రేణుల్లో మొదలైనది. మంత్రివర్గంలో చోటు దక్కని వారికే పీసీసీ భాద్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. బీసీ నేతకు ఇచ్చే అవకాశాలు సైతం ఉన్నాయని సమాచారం. సీఎం మాత్రం తనకు నమ్మకస్తుడైన రెడ్డి సామజిక వర్గానికే పదవిని కట్టబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటివరకు పీసీసీ పదవి మహిళలకు కేటాయించలేదు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న సీతక్కపై పార్టీ భాద్యతలు అప్పగించి, మహిళలకు పార్టీలో ఉన్న గౌరవాన్ని చాటుకోవాలని అధిష్ఠానము చూస్తోంది. సీనియర్ నాయకుల్లో జగ్గారెడ్డి, మధు యాష్కీ గౌడ్, కోమటి రెడ్డి బ్రదర్స్, షబ్బీర్ అలీ, అద్దంకి దయాకర్ పేర్లు వినిపిస్తున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రుల్లో మాత్రం కేసీఆర్ తోపాటు బీజేపీ ని ఎదుర్కొనే నాయకుడి కోసం వెతుకులాట ప్రారంభించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంపై అవగాహన, కేసీఆర్ పరిపాలనపై సమగ్రంగా తెలిసి ఉండటం, ప్రతిపక్ష నాయకులపై ప్రతి ఒక్కరి గురించి తెలిసి ఉండటం, విమర్శలను పార్టీ పరంగా వెంట, వెంట తిప్పికొట్టే వాక్చాతుర్యం ఉన్న నాయకుడు అవసరమనే భావనలో అధిష్టానంతో పాటు సీఎం ఉన్నట్టు సమాచారం. సీఎం తో పాటు మంత్రివర్గంతో కలుపుకొని పోయే స్వభావం ఉన్న నాయకుడు పార్టీకి ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరి.