Home » CM Revanth Reddi : రూ:150 తో హైదరాబాద్ బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddi : రూ:150 తో హైదరాబాద్ బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddi : తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి భాద్యతలు చేపట్టారు. సీఎం గా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు అయన మల్కాజి గిరి పార్లమెంట్ సభ్యుడు. 2019 లో జరిగిన ఎన్నికల్లో ఎంపీ గ ఎన్నికయ్యారు. 7 జూలై , 2021న తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకం. 31 అక్టోబర్, 2017 న కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం. 2007 లో ఇండిపెండెంట్ గ పోటీ చేసి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎమ్మెల్సీ గ గెలుపొందారు.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగుతోంది. సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డ్డి. అయినా ఇండిపెండెంట్ గానే కొనసాగారు. కానీ కాంగ్రెస్ లో అధికారం కోసం చేరలేదు రేవంత్ రెడ్డి. మే, 2006 లో ఇండిపెండెంట్ గ కప్పు సాసర్ గుర్తుపై మేడ్చల్ మండలం నుంచి జెడ్పిటీసీ గా పోటీ చేసి గలుపొందారు. జెడ్పిటీసీ గా పోటీచేయడానికి ముందు ఆయన నివాసం వాస్తవానికి ప్రస్తుత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డి పల్లె. ఆ పల్లె నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి.

అప్పుడు రేవంత్ రెడ్డి జేబులో రూ :150 మాత్రమే ఉన్నాయి. వాటితో ప్రయాణం చేసిన ఆయన నేడు సీఎం స్థాయికి ఎదిగారు. 150 రూపాయలతో హైదరాబాద్ వెళ్లిన ఆయన అక్కడి నుంచే రాజకీయ ప్రవేశం ప్రారంభించారు. అక్కడి నుంచే మొదటిసారి జెడ్పిటిసి గ ఇండిపెండెంట్ గా పోటీచేసి విజయం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తన రాజకీయ జీవితం, రాజకీయ అనుభవం చెప్పడంతో పాటు ఈ 150 రూపాయల ప్రయాణాన్నికూడా వెల్లడించడం విశేషం.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *