BRS : ఎట్టకేలకు ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బిఆర్ఎస్ బరువు దించుకొని హరీష్ రావు పరువు నిలబెట్టింది. పార్టీ ఒకవేళ సస్పెండ్ చేయని నేపత్యంలో హరీష్ రావ్ అవమానాలు ఎదుర్కోవలసి వచ్చేది. కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలోనే పార్టీ క్రమశిక్షణ కమిటీ కవితను సస్పెండ్ చేశారు. వాస్తవానికి వివరణ తీసుకున్న తరువాతనే చర్యలు ఉంటాయి. కానీ ఇక్కడ అలాంటిది జరగకుండానే ఒకేసారి సస్పెండ్ చేయడం విశేషం.
కేసీఅర్ కు రాసిన లేఖ బహిర్గతం అయిన నాటి నుంచే కవితపై చర్యలు ఉంటాయనే ప్రచారం సాగింది. కానీ పార్టీ పరంగా కేసీఆర్ ముందుకు రాలేదు. ముందూ, వెనుక ఆలోచిస్తూ తన నిర్ణయాన్ని కాలానికే వదిలేసినట్టుగా ప్రవర్తించారు. అంతా హరీష్ రావు, సంతోష్ లతోనే నష్టం వాటిల్లిందనే పద్దతిలో కవిత మాట్లాడేసరికి పార్టీ ఇరుకున పడింది.
కవితపై చర్యలు తీసుకొని నేపథ్యంలో హరీష్ రావును అవమానించినట్టు అవుతుంది. అంతే కాదు ఎంతయినా కూతురు కదా ? ఇతరులు మాట్లాడితే కేసీఆర్ ఇదే మౌనం పాటించేవారా అనే గుసగుసలు మొదలై పార్టీ ఇబ్బందులపాలయ్యేది. పార్టీ లో ఇతరులను విమర్శించి నప్పుడు కూడా చర్యలు తీసుకోడానికి కేసీఆర్ ముందుకు రాలేదు. పార్టీ కి ఉద్యమం నాటి నుంచి అండగా ఉంటున్న నాయకుడు కాబట్టే హరీష్ రావ్ ను విమర్శించడంతో క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చిందనే అభిప్రాయాలు సైతం వ్యక్త మవుతున్నాయి రాజకీయ వర్గాల్లో. పార్టీ నుంచి కవితను బహిష్కరించడంతో కల్వకుంట్ల కుటుంబం రెండుగా చీలిపోయినట్టేననే అభిప్రాయాలు కూడా వ్యక్తం కావడం విశేషం.

by