Central police : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు జూన్ 4న వెల్లడి. కూటమి ఒకవైపు. వైసీపీ ఒంటరి పోరాటం. కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగింది. వైసీపీ కి ప్రధాన రాజకీయ శత్రువు తెలుగుదేశం. ఇప్పడు ఆ పార్టీ తో ఏర్పడిన కూటమి అధికారం చేపట్టబోతోందని సర్వే చెబుతోంది. కేంద్ర నిఘా వర్గాలు కూడా అదే చెబుతున్నాయి. అధికారం చేపట్టబోయేది కూటమి. అంటే ప్రధాన పార్టీ తెలుగు దేశం. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి దాడులు చేయడం, ఆస్తులు ద్వంసం చేయడం ఇష్టం ఉండదు. అంతే కాదు ప్రజలను ఇబ్బంది పెట్టడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా నచ్చదు. మరి ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర పోలీస్ బలగాలు ఎందుకు మోహరించాయి ?.
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం గ భాద్యతలు చేపట్టబోతున్నారు. వైసీపీ ఓటమిని రుచి చూస్తోంది. అధికారం కోల్పోవడాన్నివైసీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. ఓటమిని తట్టుకోలేని నాయకులు దాడులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టాయి. టీడీపీ నాయకులతోపాటూ,జనసేన నాయకులపై కూడా దాడులు జరిగే అవకాశాలున్నాయని కేంద్ర నిఘా వర్గాలకు ఉప్పందింది. వ్యక్తులతో పాటు ప్రజల ఆస్తులపై దాడి చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని సమాచారం అందింది. అదేవిదంగా ప్రభుత్వ ఆస్తులపై కూడా దాడి చేసి నష్టం చేసే అవకాశాలు ఉన్నాయని తెలిసిపోయింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం పోలీస్ బలగాలను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పంపడానికి నిర్ణయం తీసుకొంది. ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పరచడానికి చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర పోలీస్ బలగాలను మోహరించబోతోంది. జిల్లా, మండల, మున్సిపాలిటీ కేంద్రాలతోపాటు దాడులు జరిగే అనుమానిత ప్రాంతాల్లో సైతం పోలీస్ బలగాలు రాబోతున్నాయి. ప్రభుత్వ ఆస్తుల వద్ద భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కనీసం పదిహేను రోజులపాటు పోలీస్ బలగాలు ఉండే అవకాశాలు ఉన్నాయి.. ఏపీ లో ప్రశాంత వాతావరణం ఏర్పడిన తరువాతనే పోలీస్ బలగాలు తిరుగు ముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.