Home » meet : అవును … ఆ ఇద్దరు… కలుసుకుంటున్నారు ?

meet : అవును … ఆ ఇద్దరు… కలుసుకుంటున్నారు ?

cm and ktr : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ . వీరిద్దరూ జగమెరిగిన నాయకులే. అగ్గిపుల్ల అవసరం లేకుండానే ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తె బగ్గుమంటది. ఇద్దరు కూడా ఉప్పు, నిప్పు గానే కనబడుతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా చాలు ఇద్దరి మధ్య తిట్ల పురాణమే. జిల్లేడు చెట్ల వరకు తీసుకెళ్లింది రేవంత్ రెడ్డి, కేటీఆర్ రాజకీయం. గ‌తంలో అయితే పాల‌క‌ప‌క్ష‌మైనా, ప్ర‌తిప‌క్ష‌మైనా నేత‌లంతా ఎంత విమ‌ర్శించుకున్నా… ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది. కానీ, ఇప్పుడు ఆ రాజకీయాలను ఊహించు కోవ‌డానికి కూడా కష్టంగా కనబడుతోంది.

సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ దొరుకుతాడా అని కేటీఆర్ వేయి కళ్ళతో ఎదురుచూస్తుంటారు. కేటీఆర్ తో పాటు అయన అనుచరులు కూడా సీఎం లక్ష్యంగా మాటలను తూటాలుగా చేసి వదులుతుంటారు. ఏ చిన్న అవకాశం దొరికినా వదిలిపెడుతలేరు గులాబీ శ్రేణులు ఉప్పూ-నిప్పుగా ఉండే నేత‌లు ఒకే వేదిక‌పై క‌న‌ప‌డితే…? ఊహించు కోవ‌టానికే చాలా మందికి క‌ష్టంగా ఉంటుంది. ఇద్దరు ఒకే వేదికపైకి రావడం దాదాపుగా సాధ్యం కాదు. ఊహించని పరిస్థితుల్లో ఒకే వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కనబడితే చూడటానికి రెండు కళ్ళు చాలవు.

కానీ చెప్పేదంతా కూడా నిజం కాబోతుంది. ఇద్దరు నాయకులు ఒకే వేదికపైకి రాబోతున్నారు. ఇద్దరు కలవబోతున్నారు. ఇలా చెప్పగానే రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలు తలెత్తుతాయి. ఎలాంటి అనుమానం వచ్చిన పట్టించుకోకండి. ఇటీవలనే కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి మృతిచెందారు. అయన సంతాప సభను ఈ నెల 21న హైదరాబాద్ లోని బాగ్ లింగం పల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేటీఆర్ ను కూడా సిపిఎం పార్టీ ఆహ్వానించింది. ఈ ఇద్దరు ప్రధాన నాయకులు సంతాప సభలో పాల్గొన‌బోతున్నార‌ని సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని సైతం స్పష్టం చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *