fasting : నిత్యం తీరికలేకుండా గడిపే జీవన విధానం. బయటకు వెళితే దుమ్ము, దూళి. అనారోగ్యకరమైన వాతావరణం. వీటన్నిటికీ తోడు అనారోగ్య సమస్యలు. నిత్యం వ్యాయామం. ఆహారంలో కొలత బద్ద. అయినా శారీరంలో ఎదో ఒక మూల అలసట, ఇబ్బంది. వీటన్నిటిని పారదోలాలంటే ఒక మార్గం. అదే ఉపవాసం. వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటె శరీరంలో మంచి ఫలితాలు వస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసు కుందాం.
వారంలో రెండు సార్లు ఉపవాసం ఉంటె శరీరంలో కేలరీలు వినియోగం తగ్గిపోతుంది. బరువు తగ్గుతుంది. ఉపవాసం ఉన్న రోజు శరీరంలోని కొవ్వు ఆహారంగా ఉపయోగపడుతుంది. కొవ్వు కూడా బరువు తాగడానికి సహాయపడుతుంది. కడుపు ఖాళీగా ఉండటం వలన జీర్ణక్రియ ప్రక్రియ వేగవంతం అవుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది.
ఉపవాసం ఉండటం వలన శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు తొలిగించబడుతాయి. చర్మం మెరిసేలా తయారవుతుంది. శరీరం జీర్ణవ్యవస్థ విశ్రాంతి తీసుకుంటుంది. కడుపులోని భాగాలూ శుభ్రమవుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలు తగ్గుముఖం పడుతాయి. కడుపులో ఉన్నటువంటి చిన్న, చిన్న సమస్యలు కూడా తగ్గిపోతాయి.
మానసికంగా ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మెదడు పనితీరు మెరుగవుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పాత కణాలు మెరుగవుతాయి. కొత్త కణాలు తయారవుతాయి. రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది. వ్యాధులతో పోరాడే శక్తి పెరుగుతుంది.
(నోటు : వైద్య నిపుణుల ఆధారంతో సేకరించాం )