Sleep : నిద్రపోయిన తరువాత గురక పెట్టడం సహజం. గురక పెడుతున్న వారి పక్కన మరొకరు ఉంటె వారికి నిద్ర పట్టదు. గురక అనేది ప్రతి ఒక్కరికి సాధారణ సమస్య. చిన్న, చిన్న చిట్కాలతో గురక సమస్యను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గురకను నివారించడానికి అనేక చిట్కాలు ఉన్నవి. ఆహార పదార్థాలతో కూడా దూరం చేయడానికి అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తేనె ఔషధంలా పనిచేస్తుంది. గురక తో ఇబ్బంది పడే వారు రాత్రి పూట పడుకునే ముందు ఒక చెంచా తేనే తీసుకోవాలి. ప్రతిరోజూ పడుకునే ముందు తేనె తాగితే గురక తగ్గే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
డీహైడ్రేషన్ వల్ల శ్వాసనాళాల్లోని శ్లేష్మం బిగుసుకుపోయి గురక వస్తుంది. తగినంత నీరు తాగడం వల్ల గురక రాకుండా ఉంటుంది. ఒక కప్పు వేడి నీటిలో అల్లం, తేనె కలిపి ప్రతిరోజూ తాగితే గురక తగ్గుతుంది. వెల్లకిలా పడుకుంటే కూడా గురక రాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.