Ilachi : నోటి దుర్వాశన రాకుండా అడ్డుకోడానికి ఉపయోగపడుతుందని అందరు భావిస్తారు. కూరలు సువాసన రావడానికి వాడుతారు. పాయసం లో ఉపయోగిస్తారు. కానీ యాలకులను నిత్యం వాడితో వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు.
ప్రతిరోజు యాలకులను తిన్నచో క్యాన్సర్ వ్యాధి రాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. యాలకులవలన జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
శరీరంలో రక్తపోటు అదుపులో ఉంటుంది. చక్కెర స్థాయి కూడా అదుపులో ఉంటుంది. ఆందోళన, డిప్రెషన్ నుంచి ఉపశమనం కలుగుతుంది. మానసికంగా ఆరోగ్యముగా ఉంటారు. చర్మాన్ని రక్షిస్తుంది. చర్మం కాంతివంతముగా తయారవుతుంది.
దగ్గు, తుమ్ములు, ముక్కు కారటం, గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండ అడ్డుకుంటుంది. యాలకుల టీ తాగడం వలన శరీరానికి అనేక లాభాలు ఉన్నాయి. శ్వాశకోశ సమస్యలు కూడా తొలగిపోతాయి.
దీర్ఘకాలంగా వాడుతున్న వారికి క్యాన్సర్ వ్యాధి రాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ రెండు యాలకులు నమిలి రసాన్ని మింగిన వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు లేవని వైద్యశాస్త్రంలో పేర్కొనబడింది.