srisailam : శ్రీశైలం ఆలయ కమిటీ అధికారులు, వేద పండితులు సంయుక్తంగా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా దేవస్థానం నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే పవిత్రమైన దేవాలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఇప్పుడు తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు.
ఉమ్మడి రాష్ట్రాల భక్తులకు ఎంతో పవిత్రమైనది శ్రీ శైలమల్లికార్జున స్వామి ఆలయం. ఆలయం తో పాటు పరిసర ప్రాంతాల్లో హిందూ దేవాలయాలకు సంబందించిన ప్రచారమే జరగాలి. ఇతర మతాలకు సంబంధించిన ప్రచారాలు, ప్రార్ధనలు చేయరాదంటూ శ్రీ శైలం దేవస్థానం అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
పరోక్షంగా గానీ, ప్రత్యక్షంగా గానీ అన్యమత కార్యక్రమాలకు, ప్రచారాలకు సహకరిస్తే శ్రీ శైలం దేవస్థానం నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆలయం అధికారులు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటించాలని ఆలయ కమిటీ కోరింది.