Roti : కరోనా ప్రభావంతో ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ద తీసుకుంటున్నారు. ప్రతిరోజూ తినే ఆహార పదార్థాలపై దృష్టి సారిస్తున్నారు. ఎలాంటి పదార్థాలు తింటే ఆరోగ్యముగా ఉంటామని కూడా ఆలోచి స్తున్నారు. ఇప్పుడు చాలా మంది పాత కాలపు ఆహార పదార్థాలనే తింటున్నారు. రాగులు, కొర్రలు, సజ్జలు, అవిశెలు, జొన్న రొట్టె వంటి ఆహార పదార్థాలను తిని ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతిరోజూ రాత్రి భోజనంకు బదులు జొన్న రొట్టె తింటున్నారు. ఆ జొన్న రొట్టె తినడం వలన కలిగే లాభాలను ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు.
మధుమేహం ఉన్నవారు ప్రతిరోజూ తిన్నచో గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధంగా ఉంచడంలో ఇది సహాయ పడుతుంది. జొన్న రొట్టెలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని విషపదార్థాలను తొలగిస్థాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. ఈ రొట్టెలల్లో పొటాషియం, విటమిన్ బి, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. రక్తపోటు ఉన్నవారికి తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జొన్న రొట్టెలు రక్తహీనతను తగ్గిస్థాయి. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతాయి. ప్రతిరోజూ తినడం వలన ఎముకలు బలంగా తయారవుతాయి. గుండె పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతాయి. జొన్న రొట్టెలల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. క్రమం తప్పకుండ తినడం వలన అధిక బరువు తగ్గుతారు. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పేగులు ఆరోగ్యముగా తయారవుతాయి. జీర్ణక్రియ వ్యవస్థ మెరుగవుతుంది.