Neem : వేపచెట్టు ను పూజిస్తారు. కానీ ఆ చెట్టుతో అనేక లాభాలు ఉన్న విషయం చాలా మందికి తెలియదు. వేప చెట్టు నుంచి వచ్చే ఆకు, పువ్వు, కాండం, కాయలు ఉత్పత్తి అవుతాయి. వీటితో మన శరీరానికి అనేక విధాలుగా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతన్నారు.
వేపాకును ముద్దగా చేసి అందులో కొద్దిగా తేనె, లేదంటే పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. దింతో చర్మ సమస్యలు ఉంటే తొలగి పోతాయి. నల్ల మచ్చలు, మొటిమలు, దురద రావు. వేపాకులతో మరిగించిన నీటిని పుక్కిలించాలి. తద్వారా నోటి దుర్వాసన పోవడంతో పాటు, నోటిలో ఎలాంటి సమస్యలు రావు. వేపాకు పేస్టును తలకు పెట్టుకొని అర్ధ గంట తరువాత స్నానం చేసినచో తలలో ఉన్న చుండ్రు, పేలు అంత నశించి పోతాయి.
క్యాన్సర్‌ని కంట్రోల్ చేసే గుణాలు సైతం వేపాకుల్లో లభిస్తాయి. వేపాకులు నీటిలో మరిగించి.. ఆ నీటిని తాగితే.. క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తుంది. క్యాన్సర్ రాకుండా అడ్డుకునే సామర్థ్యం ఈ వేపాకుల్లో ఉంది. క్యాన్సర్ ను నిరోధించే ఔషధ గుణాలు వేపాకులో పుష్కలంగా ఉన్నాయి. వేపాకులు నీటిలో మరిగించి, ఆ నీటిని తాగితే క్యాన్సర్ ఉన్న వ్యక్తి లో క్యాన్సర్ కణాలు పెరుగవు. ఈ వ్యాధి రాకుండా అదుపుచేసే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.