Shani : హిందూ కుటుంబాలు శనీశ్వరుడిని న్యాయదేవుడిగా కొలుస్తారు. వ్యక్తుల జన్మ నక్షత్రం ప్రకారం శని దేవుడి ప్రతాపం ఉంటుంది. జాతకం ప్రకారం శనిదేవుడు స్థానం ఆధారంగా వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. ఏలి నాటి శని దోషం కూడా ఉంటుంది. శని దోషంతో ఇబ్బందిపడే వారు ఈ కార్యక్రమాలు భక్తితో చేస్తే కొంత వరకు వారి జీవితాల్లో సంతోషం కలుగుతుందని వేదంలో చెప్పబడింది.
సూర్యోదయానికి ముందే స్నానంచేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. వెండి, రాగి, ఇనుము తో చేసిన గిన్నెలో పిడికెడు నల్ల నువ్వులు పోయాలి. అందులో ఆవనూనె పోసి పిండితో చేసిన వత్తిని తయారు చేసుకోవాలి. ఇంటికి సమీపంలో ఉన్న శని దేవాలయం, లేదంటే రావి చెట్టు వద్ద ఆ దీపాన్ని వెలిగించాలి. నువ్వులను శని దేవుడికి రావి చెట్టు వద్ద దీపం వెలిగిస్తే అక్కడే నల్ల నువ్వులు అర్పించాలి. శని దేవుడి పూజ విధానం పుస్తకం ఉంటె అందులోని శ్లోకాలను వీలైనంత మేరకు అక్కడే చదవాలి.
శని దేవుడికి నల్ల నువ్వులు, ఆవ నూనె అంటే ఇష్టం. అందుకే వాటితో తొమ్మిది శనివారాలు ఇలా శనిదేవాలయం లేదా రావి చెట్టు వద్ద పూజలు చేసినచో మంచి ఫలితం ఉంటుందని వేదం లో చెప్పబడింది. ఇలా చేయడం వలన కొంత వరకు కుటుంబానికి శుభం కలుగుతుంది.

by