Mango : వేసవి కాలంలో మామిడి పళ్ళు ఎక్కువగా మార్కెట్ లో లభిస్తాయి. ఈ కాలంలో వచ్చే పళ్ళను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటి ధర ఎక్కువ ఉన్నప్పటికీ సీజన్ లో కొనడానికి ముందుకు వస్తారు ప్రజలు. కానీ మామిడి పండు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు…….
మామిడి పండ్లు విటమిన్ సి కి మంచి మూలం. మలబద్ధకం వంటి కడుపు సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులను నివారించడంలో కూడా సహాయపడుతుంది. ప్రతిరోజు మ్యాంగో జ్యూస్ తాగడం వల్ల జుట్టు పొడవుగా, మందంగా పెరుగుతుంది. మామిడి పండ్లను తినడం వల్ల శరీరంలోని జీర్ణవ్యవస్థ వేగంగా పెరుగుతుంది.
విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ లతో సమృద్ధిగా ఉండటం వలన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. మామిడిని తినడంవల్ల శరీరంకు అదనపు గ్లో లభిస్తుంది. మామిడి పండ్లు గుండె ఆరోగ్యానికి ముఖ్యమైన ఖనిజమైన పొటాషియంకు మంచి మూలం. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి శరీరాన్ని ఇన్ఫెక్షన్, వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.