dil raju : చిత్ర పరిశ్రమకు ఇటీవల ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. పుష్ప-2 సినిమా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనను నేటికీ చిత్ర పరిశ్రమ మరువలేక పోతోంది. ఆ ఘటనకు భాద్యత వహిస్తూ హీరో అల్లు అర్జున్, నిర్మాత తదితరులు క్షమాపణలు చెప్పారు. కొన్ని ఖర్చులు కూడా భరించాల్సి వచ్చింది. అదేవిదంగా గేమ్ చెంజర్ సినిమా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి వెళుతున్న ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ సంఘటనతో కూడా రామ్ చరణ్ మానసికంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది.
తాజాగా దిల్ రాజు కూడా నోరు జారడంతో తెలంగాణ ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. దింతో ఆయన కూడా క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవల నిజామాబాద్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా దిల్ రాజు మాట్లాడుతూ దావత్ చేసుకుందాం.! తాగుదాం.! అని అన్నారు.
తెలంగాణ సంస్కృతిని దిల్ రాజు తక్కువ చేసి మాట్లాడారు అంటూ కొందరు కామెంట్స్ చేశారు సోషల్ మీడియా లో. ఆయన ఏ ఉద్దేశ్యంతో మాట్లాడారో తెలియదు. కానీ వెంటనే ఆయన తాను మాట్లాడిన మాటలకూ బాధపడుతున్నానని, అందుకు క్షమాపణలు చెబుతున్నానని వెంటనే ప్రకటించారు. దింతో ఈ వివాదం కాస్త సద్దుమణిగిపోయింది.