Home » marriage : మిస్ నుంచి మిసెస్ కాబోతున్న ముగ్గురు హీరోయిన్లు ఎవరో తెలుసా ?

marriage : మిస్ నుంచి మిసెస్ కాబోతున్న ముగ్గురు హీరోయిన్లు ఎవరో తెలుసా ?

marriage : తెలుగు చిత్ర పరిశ్రమలో ఎదో ఒక ఇంటిలో భాజా భజంత్రీలు మోగుతుంటాయి. పరిశ్రమలో ఇటీవల పెళ్లి సందడి ఎక్కువయ్యింది. హీరోయిన్లు ఒక్కొక్కరుగా పుట్టినిల్లు వదిలిపెట్టి మెట్టినింటి బాట పడుతున్నారు. ఈ కొత్త సంవత్సరంలో ముగ్గురు స్టార్ హీరోయిన్ ల ఇంట భాజాలు మోగనున్నాయని చిత్ర పరిశ్రమలో గుస,గుసలు మొదలైనాయి. ఇంతకూ మిస్ నుంచి మిసెస్ అయ్యే ఆ ముగ్గురు ఎవరో తెలుసుకుందాం……

రశ్మిక ఒక ప్రముఖ తెలుగు హీరోతో సన్నిహితంగా ఉంటున్నదని తెలుగు చిత్ర పరిశ్రమలో గుసగుసలు మొదలైనాయి. ఆ హీరో తో కలిసి నటించింది కూడా. ఇటీవలనే ఒక నిర్మాత కూడా రశ్మిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నదని, కానీ ఆమె మెడలో తాళి కట్టే వ్యక్తి పేరు మాత్రం చెప్పనని ప్రకటించడం విశేషం.

తమన్నా పెళ్లి పీటలెక్కడం ఖాయమని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. బాలీవుడ్ నటుడితో తమన్నా.డేటింగ్ చేస్తున్నదని ,వీరిద్దరూ ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటించారు కూడా. అందులో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది. త్వరలోనే తమన్నా ఆ హీరోతో పెళ్లి జరగబోతుందనే ప్రచారం పరిశ్రమలో జరుగుతోంది.

దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా తన ప్రియుడితో కలిసి గుళ్ళు, గోపురాలు వెళుతూ పూజలు చేస్తోంది. తిరుమల,తిరుపతి దేవస్థానం వరకు ఆ ప్రియుడితో వెళ్ళింది. త్వరలోనే జాన్వీ కపూర్ తన ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమంటున్నారు పలువురు చిత్ర పరిశ్రమకు చెందిన వారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *