Home » ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఆ పాత్ర చేయను :చిరంజీవి

ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఆ పాత్ర చేయను :చిరంజీవి

xr:d:DAGBRDuLR64:111,j:1782724260177384480,t:24041304

కోల్ బెల్ట్ ప్రతినిధి:
చిరంజీవి కి సినీ పరిశ్రమలోకి ప్రవేసించేనాటికి తనకంటూ ఆదుకునేవారు ఎవరూ లేరు. పెద్ద దిక్కు అంటూ ఎవరు లేరు.మద్రాస్ లో అడుపెట్టినప్పుడు అతనికంటే సీనియర్ ఆర్టిస్టులు సినిమా కోసం వచ్చానంటే హేళనగా మాట్లాడారు. చిన్న చూపు చూశారు. అయినా మానసికంగా కుంగిపోలేదు. పరిశ్రమను విడిచి ఇంటికి తిరిగిరాలేదు.నటనలో శిక్షణ తీసుకున్నాడు. పరిశ్రమలో తనకు ఎవరు అండగా లేనప్పటికిని ఆ శిక్షణనే నమ్ముకున్నాడు. పరిశ్రమలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు.వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు.ఒక్కో మెట్టు ఎదుగుతూ పద్మశ్రీ అవార్డును సొంతం చేసుకున్నాడు.చిత్ర పరిశ్రమకు అండగా నిలిచాడు.స్వర్గీయ ఎన్టీరామారావు,కృష్ణ,అక్కినేని,శోభన్ బాబు,కృష్ణంరాజు లచే ప్రశంసలు అందుకున్నాడు.పరిశ్రమలో తిరుగులేని కథ నాయకుడిగా ఎదిగాడు.
ఏ పాత్ర అయినా ఒకే ….
విజేత,ఆపద్బాంధవుడు,స్వయంకృషి,ఇంట్లోరామయ్య వీధిలో కృష్ణయ్య,గ్యాంగ్ లీడర్,శ్రీ మంజునాథ,మగమహారాజు,ప్రాణం ఖరీదు,శంకర్ దాదా MBBS ఇలా 150 కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు.తన వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసాడు.నటించిన ప్రతి సినిమా విజయాలను అందుకున్నాయి.ఇప్పుడు ఆయన వారసులను కూడా తన దారిలోనే నడిచెవిదంగా తీర్చిదిద్దుతున్నాడు
ఆ ఒక్క పాత్ర తప్ప ….
చిరంజీవి ఇప్పటివరకు 150 కి పైగా సినిమాలు నటించి మెప్పించాడు.ఆయన సినిమా వస్తుందంటే అభిమానుల్లో సందడి మొదలవుతుంది. ఇప్పటివరకు నటించిన పాత్రల్లో ఒక పాత్రకు మరొక పాత్రకు సంబంధం లేకుండానే నటించాడు.పారితోషకం తో సంబందం లేకుండా కథలో తప్పనిసరిగా నీతి ఉండాల్సిందే.అప్పుడే చిరు ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవాడు.కానీ ఇప్పటివరకు ఆ ఒక్క పాత్రను మాత్రం చిరు ఒప్పుకోలేదు. ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఆ పాత్ర చేయనని చిరంజీవి ప్రకటించాడు. జబ్బు పడిన వ్యక్తిగా నటించే హీరో పాత్రను ఎట్టిపరిస్థితుల్లోనూ ఏనాటికి కూడా ఒప్పుకునేది లేదంటున్నారు చిరంజీవి.

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *