Pavan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా పై అయన అభిమానులు గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నారు. 2020 లో సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో తీరిక లేకుండా ఉండటం కూడా కొంత తోడైనది సినిమా ఆలస్యం కావడానికి. సినిమా షూటింగ్ పూర్తయినది. సాంకేతిక పరంగా కూడా పనులు పూర్తి చేస్తారు చిత్ర బృందం.
కానీ ఏ ముహూర్తాన సినిమా షూటింగ్ మొదలు పెట్టారో కానీ రిలీజ్ మాత్రం అనుకున్న సమయంలో కావడంలేదు. వాయిదాల మీద, మీద వాయిదాలు పడుతున్నాయి. ఒక దశలో అభిమానులకు కూడా అనుమానాలు మొలకెత్తినయ్. సినిమా విడుదల కాకపోవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమైనాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో గత నాలుగేళ్లుగా తీరిక లేకుండా ఉండటమే ప్రధాన కారణం.
ఇదే ఏడాదిలో మొదట మార్చ్ 27న సినిమా విడుదల చేస్తున్నామని సినిమా పెట్టుబడిదారులు ప్రకటించారు. ఆ తేదీ పలు కారణాల వలన వాయిదా పడింది. ఆ తరువాత జూన్ 12న విడుదల అన్నారు. తాజాగా జులై 24న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అభిమానుల్లో ఆనందం వ్యక్తమైనది. ఏదిఏమైనప్పటికీ అభిమానుల్లో ఎక్కడో కొంత అనుమానం తప్పడంలేదు.