Mega Hero : మెగా సినీ కుటుంబంలో ఒక హీరో జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. ఎక్కువ సమయం జిమ్ లోనే గడుపుతున్నారు. ఇటీవల ఆయన కొంతమేరకు అధిక బరువు పెరిగారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక కొత్త సినిమాకు అంగీకరించారు. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ కూడా మొదలైనది.
నూట ఇరువై కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగా హీరో నటిస్తున్నారు. ఈ సినిమాకు రోహిత్ పి.కె దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్ శివారుల్లో షూటింగ్ జరుగుతోంది. నిరంజన్ రెడ్డి సినిమాను రూ : 120 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
స్వాతంత్య్రం రాక పూర్వం జరిగిన కథతో నిర్మిస్తున్నారు. మెగా హీరో ఈ సినిమాలో స్వాతంత్య్ర సమరయోధుడి పాత్రలో నటిస్తున్నారు. మెగా హీరో ఇప్పటి వరకు ఇంత పెద్ద బడ్జెట్ సినిమాలో ఎప్పుడు నటించలేదు. ఇప్పుడు నటిస్తున్న సినిమానే అతి పెద్ద బడ్జెట్ సినిమా
రూ :120 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్న మెగా హీరో ఎవరో కాదు. మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఇటీవలనే తేజ్ కొంత బరువెక్కారంట. ఒకవైపు పెరిగిన బరువు. మరోవైపు స్వాతంత్య్ర సమరయోధుడి పాత్ర. కాబట్టి బరువు తగ్గించుకుంటూనే సాయి ధరమ్ తేజ్ మరోవైపు సిక్స్ ప్యాక్ తో తయారవుతున్నారు. ఈ సినిమాలో తేజ్ సిక్స్ ప్యాక్ లో కనిపించబోతున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సిక్స్ ప్యాక్ లో కనిపించ బోతున్నారని తెలిసి మెగా అభిమానులు ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.