Home » Friz : ఫ్రిజ్ లో ఆ నాలుగు పదార్థాలు నిల్వ ఉంచరాదు.

Friz : ఫ్రిజ్ లో ఆ నాలుగు పదార్థాలు నిల్వ ఉంచరాదు.

Friz : ఇంటిలో మనం వాడే ఆహార పదార్థాలు మిగిలిపోతే, వాటిని ఫ్రిజ్ లో ఉంచుతాం. ఫ్రిజ్ లో భద్రపరిచిన పదార్థాలను తిరిగి మరుసటి తినడానికి వాడుకుంటాం. కానీ ఫ్రిజ్ లో అన్ని పదార్థాలను ఉంచరాదని, ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కొన్ని పదార్థాలు నిల్వ ఉంచితే అవి విషపూరితంగా తయారవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అల్లం తాజాగా ఉండటానికి చాలా మంది ఫ్రిజ్ లో నిల్వ ఉంచుతారు. ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు ఫ్రిజ్ లో అల్లం నిల్వ ఉంచరాదు. అల్లా ఉంచితే అల్లంపై ఫంగస్ పేరుకుపోయి అల్లం విషపూరితంగా మారుతుంది. అటువంటి అల్లం వంటలో ఉపయోగిస్తే కిడ్నీ, ఊపిరితిత్తులు చెడిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.

వండిన అన్నం 24 గంటలకు పైగా ఫ్రిజ్ లో నిల్వ ఉంచితే అది విషపూరితంగా తయారవుతుంది. వండిన అన్నం వేడిగా ఉన్నప్పుడే తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఫ్రిజ్ లో నిల్వ ఉంచితే బ్యాక్టీరియా పెరిగి విషమంగా తయారవుతుంది.

ఉల్లిపాయలు వాయువులను విడుదల చేస్తాయి. కోసిన ఉల్లిపాయలు ఫ్రిజ్ లో పెట్టి వాడుకోవడం చాలా ప్రమాదకరం. పొడి ప్రదేశాల్లో మాత్రమే ఉంచాలి. ఫ్రిజ్ లో నిల్వ ఉంచడం వలన తేమ, విషవాయువులను విడుదల చేస్తాయి.

వెల్లుల్లి పాయలను కూడా ఫ్రిజ్ లో ఎట్టి పరిస్థితుల్లో నిల్వ ఉంచరాదు. ఒలిచిన పాయలను ఫ్రిజ్ లో నిల్వ ఉంచితే వాటిలోని పోషకాలు నశిస్తాయి. అటువంటప్పుడు ఒలిచిన పాయలు ఫ్రిజ్ లో నిల్వ పెట్టి వాడుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *