Chiranjeevi : తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త టెక్నాలజీ నడుస్తోంది. భారీ సెట్టింగ్ వేయడం లేదు. సీజీ సెట్అప్లతో సినిమా నిర్మిస్తున్నారు. సెట్ అప్ ల నిర్మాణం ముందుకు రావడంతో సెట్టింగ్ వేసే పనులకు తీర వేశారు. మెగా స్టార్ నటిస్తున్న ” విశ్వంభర ” సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. సంక్రాంతికి అభిమానుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటిస్తోంది.
ఇపుడు మెగాస్టార్ నటిస్తున్న ” విశ్వంభర ” సినిమాలో చిత్ర బృందం కూడా సెట్ అప్ తోనే ముందుకు వెళుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది వేశారు. మరో నాలుగు అవసరం వేస్తారని సమాచారం. మొత్తం సెట్ అప్ లు 12 అవసరం ఉన్నాయి. విశ్వంభర చిత్రానికి ఆర్ ఎస్ ప్రకాష్ సెట్ అప్ లను తీర్చి దిద్దుతున్నారు. ఆయన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన నాటి నుంచి ఎన్ని సెట్ లు వేయడం ఇదే తొలిసారని చిత్ర బృందం టాక్.
” విశ్వంభర ” సినిమా పక్కా సోసియో ఫాంటసీ సినిమా. ఇప్పటివరకు ఈ సినిమాలో కనిపించని సరికొత్త లోకాన్ని దర్శకుడు ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియో లో ఈ సినిమా కోసం, అందులో చిరంజీవి స్థాయికి తగ్గట్టుగా ప్రత్యేకంగా భారీ సెట్ లు వేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో లో ఆగష్టు 3 తేదీ నుంచి చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఇంకో విషయం ఏమిటంటే.
ఈ సినిమాలో ఐటెం సాంగ్ కూడా పెడుతున్నారు. ఈ ఐటెం సాంగ్ లో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ హీరోయిన్ ఆ ఐటెం సాంగ్ లో చిరంజీవితో కలిసి డాన్స్ వేయబోతోంది. ఈ నెల 22 తేదీ చిరంజీవి పుట్టిన రోజు. ఈ రోజున “విశ్వంభర ” సినిమాకు సంభందించిన గ్లింప్స్ రాబోతున్నాయని చిత్రబృందం ప్రకటించింది. తన పుట్టిన రోజు పురస్కరించుకొని గ్లింప్స్ ను మెగా స్టార్ తన అభిమానులకు పెద్ద గిఫ్ట్ కాబోతున్నాడని చిత్ర బృందం ప్రకటించింది.