Actor Saroja devi : దక్షణ భారత సినిమా పరిశ్రమలో నలబై ఏళ్ల పాటు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ సీనియర్ నటి బి సరోజా దేవి ఇక లేరు. బెంగుళూర్ లోని తన నివాసంలో అనారోగ్యంతో సోమవారం కన్ను మూశారు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించారు. 1955 లో సినిమా పరిశ్రమలో అడుగుపెట్టారు.
1957 లో పాండురంగ మహత్యం తెలుగు సినిమా ద్వారా పరిచయమయ్యారు. 1969 లో భారత ప్రభుత్వం ఆమెను పద్మ శ్రీ బిరుదుతో సత్కరించింది. 1992 లో పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. మహాకవి కాళీ దాసు సినిమాలో తన నటనకు జాతీయ అవార్డు అందుకున్నారు. ఆమె మృతి చెందిన వార్త తెలియగానే సినీ ప్రముఖులు, అభిమానులు, తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.