Actor : చిత్ర పరిశ్రమలో అవకాశం దొరకడమే ఒక అదృష్టం. వచ్చిన అదృష్టాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. పోటీ తత్వాన్ని తట్టుకోవడం చిత్రపరిశ్రమలో పెద్ద సవాల్. కొందరు ముద్దుగుమ్మలు వచ్చిన అవకాశంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ పెద్ద స్టార్ అవుతారు. ఒక అందాల ముద్దుగుమ్మ మాత్రం ఇరుకు గదుల్లో ఉంటూ, అన్నం దొరకని పరిస్థితుల్లో గడిపింది. చివరకు ఒకపూట న్యూడుల్స్ తింటూ ఆకలి తీర్చుకుంది. ఆ ముద్దుగుమ్మ ఎవరంటే…
బాలీవుడ్ పరిశ్రమలో ఎందరో ముద్దుగుమ్మలు ఉన్నారు. వారిలో దియా మీర్జా ఒకరు. ఈ ముద్దుగుమ్మ మొదట మోడలింగ్ లో అడుగు పెట్టింది. ఆ తరువాత నటిగా మారింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అభిమానులను సంపాదించుకొంది. తన కెరీర్ కు తల్లి దండ్రుల మద్దతు లేదు అని ఒక్క సందర్భంలో తెలిపింది.
లారాదత్తతో కలిసి ముంబయ్ లో ఇరుకు గదిలో గడిపింది. ఫ్యాషన్ షో లో పాల్గొనేది. కానీ చేతిలో ఒక్క రూపాయి కూడా ఉండేది కాదు. తినడానికి తిండి లేదు. పైసలు ఉన్నప్పుడు న్యూడుల్స్ తో ఆకలి తీర్చుకునేది. లేదంటే నీళ్లు తాగి పస్తులు ఉండేది. ఇలాంటి నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపినట్టుగా ఇటీవల ఒక సందర్భంలో దియా మీర్జా తెలిపారు.