Venky : సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో నటుడు విక్టరీ వెంకటేష్ మంచి జోష్ లో ఉన్నాడు. ఊహించిన దానికంటే మంచి విజయాన్ని అందించింది. అంతే కాదు కలెక్షన్ కూడా రూ : 300 కోట్లకు పైగా సాధించింది. భారీగా కలెక్షన్ సాధించడంతో చిత్ర బృందం ఆనందంలో మునిగిపోయింది. భారీ విజయాన్ని అందుకోవడంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా OTT విడుదల పై అధికారికంగా సినిమా పెట్టుబడిదారులు విడుదల చేశారు. మరికొద్ది గంటల్లో వేంకటేశ్ OTT లో సందడి చేయబోతున్నారు.
ఓటిటి ద్వారా సినిమాను విడుదల చేయనున్నామని సినిమా పెట్టుబడి దారులు ప్రకటించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అదేవిదంగా శాటిలైట్ హక్కులను కూడా జీ5 సొంతం చేసుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో మార్చ్ 1 తేదీన సాయంత్రం ఆరు గంటలకు జీ తెలుగుతో పాటు జీ5లో కూడా స్ట్రీమింగ్ కాబోతోంది. ఓటీటీలో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో సైతం ‘సంక్రాంతి వస్తున్నాం’ స్ట్రీమింగ్ కాబోతుంది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వెంకీ మామ అభిమానులకు శుభవార్త రావడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.