Sri ram : ప్రతి హిందూ కుటుంబం భక్తి శ్రద్దలతో జరుపుకునే పండుగ శ్రీ రామ నవమి. శ్రీరాముని జన్మదినోత్సవం పురస్కరించుకొని పండుగలా జరుపుకుంటారు. నవమి పురస్కరించుకొని భక్తి శ్రద్దలతో శ్రీరాముని కళ్యాణం నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సంవత్సరం నవమి వేడుకను ఏ రోజు జరుపుకుంటారు. పూజ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం….
హిందూ పంచాంగం ప్రకారం చైత్రమాసం, శుక్లపక్ష నవమి తిథి అంటే క్యాలండర్ ప్రకారం ఏప్రిల్ 5న సాయంత్రం 7:26 గంటలకు మొదలవుతుంది. నవమి తిథి మరుసటి రోజు అంటే ఏప్రిల్ 5న సాయంత్రం 7:26 గంటలకు ముగుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం నవమి తిథి శ్రీ రామ నవమి 2025 ఏప్రిల్ 6న జరుపుకోనున్నామని వేద పండితులు చెబుతున్నారు.
సూర్యోదయానికి ముందే కుటుంబం అంతా స్నానాలు పూర్తి చేయాలి. పూజ గదిని శుభ్రం చేయాలి. పీటపై కొత్త వస్త్రాన్ని ఏర్పాటు చేసుకొని, దానిపై శ్రీరాముడి విగ్రహాన్ని పెట్టాలి. గంగాజలం, పువ్వులు, పంచా మృతం సమర్పించాలి. పళ్ళు, చలిమిడి, బెల్లం పానకం, వడపప్పును నైవేద్యంగా సమర్పించాలి. సుందరకాండ పారాయణం చేయాలి. చివరగా శ్రీరామునికి హారతి ఇవ్వడంతో పూజ విధానం ముగుస్తుంది.