***నవ్వుకున్నంత నవ్వులు
***అందాలు ఆరబోసిన మృణాల్
***కొత్తతరహాలో ఫయిటింగులు
——————-
కోల్ బెల్ట్ న్యూస్:హైదరాబాద్
——————-
స్వతహాగా ఎదిగిన స్టార్ హీరో విజయ్ దేవరకొండ.ఆ హీరోకు జోడిగా బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ నటించింది.ఆ ఇద్దరి నటనతో పరశురాం దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానరుపై దిల్ రాజు శిరీష్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఫామిలీ స్టార్ భారీ అంచనాల నడుమ శుక్రవారం విడుదల అయ్యింది.ఈ చిత్రం చూసిన అభిమానులు సోషల్ మీడియాలో చిత్రంలోని సన్నివేశాలను తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అభిమానులు ముందుగానే ప్రీమియర్స్ చూసి ఆనందించారు.విజయ్ దేవరకొండ సున్నితంగా మాట్లాడుతూ వదిలిన డైలాగులు,మృణాల్ ఠాకూర్ సమయం,సందర్భం ప్రకారం ఆరబోసిన అందాలు ఆకట్టుకున్నాయి. చిన్న,చిన్నగ మాట్లాడుతూ వదిలిన విజయ్ దేవరకొండ పంచులు ఈ సినిమాలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి.
మెప్పించిన హీరో,హీరోయిన్ ల నటన ….
సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మిక్సుడ్ టాక్ లభించింది. స్క్రీన్ ప్లే అభిమానుల ఆశలకు తగ్గట్టుగా ఆకట్టుకోనప్పటికీ హీరో,హీరోయిన్ ల నటన మాత్రం మెప్పించింది.అయితే ఎమోషన్ దృశ్యాలు మాత్రం అక్కటుకునేవిదంగా దర్శకుడు తీర్చిదిద్దాడు.కానీ సినిమా చూస్తున్నంత సేపు అభిమానులకు, ప్రేక్షకులకు బోర్ రాకుండా ఆనందంగా థియేటర్ లో కుటుంబమంతా ఫామిలీ స్టార్ గడపవచ్చు. మృణాల్ ఠాకూర్ కు మా ఇంటి బొమ్మ అని,ముద్దు గుమ్మ అంటూ పేర్లతో సినిమా గురించి అభిమానులు సరదాగా మాట్లాడుకోవడం విశేషం
ఫ్యామిలీ చూడాల్సిన సినిమా……
సినిమా చూస్తున్నంత సేపు ఆనందంగా గడపవచ్చని,అదేవిదంగా నవ్వులకు కొదవలేదని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇక మృణాళి ఠాకూర్ కనిపించినంతసేపు అందాల ఆరబోతకు కొదువలేదు.పాటల్లో ఆ డాన్స్ హీరో,హీరోయిన్లు పోటాపోటీగా చేశారు అని చెప్పవచ్చు .సినిమా మొదటి భాగం చూస్తున్నంత సేపు తరువాత ఏమి జరుగుతుంది అనే ఆత్రుత ప్రేక్షకుల్లో కనపడుతుంది. ఇంటర్వెల్ తరువాత కూడా ఫామిలీ స్టార్ చూస్తున్నంతసేపు ఫామిలీ అంత కూడా ఎంజాయ్ చేయవచ్చంటున్నారు ప్రేక్షకులు.దర్శకుడు పరశురాం రాసిన మాటలు యతిప్రాసలతో అక్కడక్కడ నవ్వించే విదంగా ఉన్నాయి.ఆయన మాటలు మధ్య తరగతి కుటుంబాల జీవన విధానాన్ని కూడా ఏవిదంగా ఉంటుందో గుర్తుచేస్తుంది.గీత గోవిందం సినిమాకు సంగీతం అందించి ప్రేక్షకులను,అభిమానులను మెప్పించిన గోపి సుందర్ కూడా ఇదే సినిమాకు మంచి సంగీతాన్ని అందించి అభిమానాన్ని అందుకున్నాడు. ఓవర్ ఆల్ గ ఫామిలీ స్టార్ సినిమా పేరుకు తగ్గట్టుగానే ఫ్యామిలీ అంతా కలిసి చూసే విదంగా దర్శకుడు పరశురాం తీర్చిదిద్దడంటూ ప్రేక్షకులు,విజయ్ దేవర కొండ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.