2024–2025 శ్రీ క్రోది నామసంవత్సరంలో రాశి ఫలాలు
ఏడాది కాలంపాటు మనల్ని నడిపించేది పంచాంగం
వేద పండితుల పంచాంగం ఆధారంతో
కోల్ బెల్ట్ న్యూస్:మంచిర్యాల
మకరం రాశి
ఉత్తరాషాడ 2,3,4, పాదాలు
శ్రవణం,ధనిష్ఠ 1,2, పాదాలు
ఆదాయం 14,వ్యయం 14
రాజపూజ్యం 3, అవమానం 1
అదృష్ట యోగం 50శాతం ఉంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉన్నాయి. పలు మార్గాల్లో అనుకున్న అభివృద్ధిని సాధిస్తారు. ఎదుటివారిని బుద్ధిబలంతో మెప్పిస్తారు. రైతులకు అనుకూలవాతావరణం. ఉత్తరార్థంలో అభివృద్ధి ఉంది. అవివాహితులకు మే తరువాత అనుకూలవాతావరణం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించుకోవచ్చు.పెళ్లి ప్రయత్నాల్లో విఫలమైనవారు కొత్త సంవత్సరంలో ప్రయాత్నాలు చేస్తే సఫలం అవుతారు.అవివాహితుల పెళ్ళికి అవరోధాలు రావు.ఆరోగ్యవంతులుగా ఉంటారు. కష్టాలు తొలిగిపోయి,అభివృద్ధి సాధిస్తారు. కొత్తగా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి.స్నేహం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.ప్రయాణంలు అంతగా అనుకూలించే అవకాశాలు లేవు. శని,కేతు,గురు శ్లోకాలు చదువుకుంటే శుభం కలుగుతుంది.