Home » Police : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

Police : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

బెదిరింపులకు గురిచేస్తే కఠిన చర్యలు
ముందస్తు కార్యక్రమాలకు అనుమతి తప్పనిసరి
జనవరి 27 నుంచి 31 వరకు పోలీస్ యాక్ట్
పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్

Police : రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నామని పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. సిటీ పోలీస్ యాక్ట్ 7 (1), 2016, యాక్ట్, 22 (1) (a )నుండి (f ) మరియు 22 (2) (a) & ( b), & 22 (3) సిటీ పోలీస్ యాక్ట్, 1348 No IX ఫాస్లి సెక్షన్ 30 పోలీస్ యాక్టు 1861 ప్రకారం జనవరి 27 న ఉదయం 6:00 గంటల నుంచి జనవరి 31న ఉదయం 6 గంటల వరకు ఆమలులో ఉంటుందని సీపీ తెలిపారు.

ఎవరైనా చట్టాన్ని అతిక్రమిసే పోలీస్ యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో ధర్నా, ర్యాలీ, రాస్తారోకో, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. ఎవరైనా ధర్నా, ర్యాలీ, రాస్తారోకో, సభలు, సమావేశాలు నిర్వహించాలను కుంటే తమ శాఖ నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు.

బంద్ పేరిట వివిధ కారణాలను చూపుతూ బలవంతంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి చేయడంతో పాటు బెదిరింపులకు గురిచేయరాదన్నారు. ఒకవేళ అటువంటి చర్యలకు పాల్పడితే, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసు శాఖ కు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ కోరారు.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *